Vaccines: టీబీ నుంచి డెంగ్యూ వరకూ టీకాలు.. 8 కొత్త వ్యాక్సిన్‌ల పరీక్షకు పర్మిషన్..!
- అంటు వ్యాధులకు టీకాలతో ఆరికట్టాలని ప్రభుత్వం నిర్ణయం..
- ఆరు ఫార్మా కంపెనీలకు 8 వేర్వేరు వ్యాక్సిన్‌లపై ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి..
- టీబీ నుంచి డెంగ్యూ వరకూ టీకాలు.. 8 కొత్త వ్యాక్సిన్‌ల పరీక్షకు పర్మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaccines: టీకాలతో కరోనాకు నిలవురించడంలో సక్సెస్ సాధించిన తర్వాత ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం 8 కొత్త వ్యాక్సిన్‌లను పరీక్షించడానికి పర్మిషన్ ఇచ్చింది. కాగా, ఇందులో టీబీ నుంచి డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ వరకూ టీకాలు రెడీ చేస్తున్నారు. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్‌లు తుది దశకు చేరుకున్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు 8 వేర్వేరు వ్యాక్సిన్‌లపై ట్రయల్స్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్‌ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: 35 Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ
Also Read
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
కాగా, హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్‌డిఎన్‌ఎ), ఇన్‌యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్‌ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్‌లపై ఫేజ్- II ట్రయల్స్ చేసేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ పర్మిషన్ తీసుకుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అలాగే, డెంగ్యూ వ్యాక్సిన్‌పై మూడవ దశ ట్రయల్ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: Simbaa OTT: ఓటీటీలోకి అనసూయ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అలాగే, టీబీ ఇన్‌ఫెక్షన్ నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్‌పై పని చేస్తుంది. ఇందులో భాగంగానే టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. ట్రయల్‌లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్‌సీఓ దశ- III ట్రయల్‌ను స్టార్ట్ చేసేందుకు కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతోందని సీడీఎస్‌సీఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు. ఇది ఊపిరితిత్తులు, శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు తీవ్ర కారణమౌతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో చోటు దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్‌కు జీఎస్‌కే కంపెనీకి పర్మిషన్ దొరికింది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!