ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఆకుకూరలో శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఈరోజు మనం మెంతి కూరను ఎండాకాలంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతుకూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుకూర సూర్యుడు నుంచి కలిగే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. ఎండాకాలంలో డిహైడ్రేషన్ దరిచేరకుండా చేస్తుందని, అలాగే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.. ఈ ఆకులల్లో క్యాల్షియం, ఐరన్.. ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. ఎముకలు దృడంగా అవ్వడానికి ఇవి సహాయ పడతాయి..
ఇక అలాగే బరువు తగ్గాలని అనుకొనేవారు ఆకుకూరలను డైట్ లో తప్పకుండ చేర్చుకోవాలి.. ముఖ్యంగా మెంతుకూర ప్రతిరోజు తినడం ద్వారా మన బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను కరిగిస్తుంది. మెంతి చపాతీ లాంటివి చేసుకొని తినవచ్చు.. వడదెబ్బ తగలకుండా ఉంటుంది.. వేడిని తగ్గించడంలో సహాయ పడుతుంది.. జుట్టు సంరక్షణ లో మెంతి ఆకులు బాగా పనిచేస్తాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.