Bones at Risk: తెలుగు సినిమాల్లో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది.. ‘బొక్కలు’ ఇరుగుతాయ్ జాగ్రత్త.. నిజంగా ఇవి పాటించకపోతే మీ బొక్కలు ఇరగడం కాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మానవ శరీరంలో ఎముకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ఏ పని చేయాలన్నా అవే ప్రధానం. కానీ కొన్ని చెడు అలవాట్ల కారణంగా మీ ఎముకలు బలహీనంగా మారుతున్న విషయం మీరు గమనించారా? అసలు ఎంటి మనం చేసే పొరపాట్లు.. వాటి నుంచి ఎలా గట్టెకాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ MORE: Raksha Bandhan 2025: ప్రధాని మోడీ కోసం రాఖీ సిద్ధం చేసిన పాక్ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్..
ఇవి వద్దు..
మనం తీసుకునే సోడా, కాఫీ లాంటివి ఎక్కువ తాగడం వల్ల బోన్స్ వీక్ అవుతాయని మీలో ఎంత మందికి తెలుసు. వీటి బదులు కాల్షియం ఉండే పాలు, హెర్బల్ టీ లేదా నిమ్మరసం కలిపిన మంచినీళ్లు తాగడం బెస్ట్ అని ఎంత మందికి తెలుసు. కాఫీలో ఉండే కెఫిన్ కారణంగా బాడీలో నుంచి యూరిన్ ద్వారా కాల్షియం బయటకు పోతుంది.
సోడాలో ఉన్న ఫాస్ఫారిక్ యాసిడ్ కారణంగా బాడీలోకి కాల్షియాన్ని చేరనివ్వదు. అందుకే వాటి బదులుగా పాలు, హెర్బల టీ, నిమ్మరం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
వెంటనే వీటిని మానేయండి..
స్మోకింగ్ చేస్తే ఎముకలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందని మీలో ఎంత మందికి తెలుసు. స్మోకింగ్ కారణంగా బాడీలోని అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయన్న విషయం తెలుసా. అలాగే, ఆల్కహాల్ ఎక్కువగా తాగితే బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఈక్రమంలో ఎముకలు బలహీనపడి విరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ దురలవాట్లకు దూరంగా ఉంటేనే ఎముకలు బలంగా ఉంటాయని పేర్కొన్నారు.
డీ విటమిన్ కావాలి మిత్రమా..
మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే బాడీలో విటమిన్-D ఉండాలి. విటమిన్-D ఎక్కువగా ఎండ నుంచి లభిస్తుంది. ఇది బాడీలోకి కాల్షియం చేరడానికి హెల్ప్ అవుతుంది. ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటే ఎండ సరిగ్గా తగలదు. దీని కారణంగా బాడీలో విటమిన్-D తగ్గిపోయి ఎముకలు, కండరాలు వీక్‌గా మారుతాయి. అందుకే డాక్టర్లు రోజూ ఉదయం లేదా సాయంత్రం 10-20 నిమిషాలు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు.
బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే..
బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే వాటిపై కొంత ప్రెజర్ పడాలి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల ఎముకలు వీక్‌గా మారతాయి. మనం ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల ఎముకలకు ఆ స్ట్రెస్ ఉండదు. దీనివల్ల వాటి డెన్సిటీ తగ్గుతుంది. అందుకే ప్రతి గంటకు ఒకసారి లేచి నిలబడి, నడవడం బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.