మన ఆహారపు అలవాట్లే మనకు కొత్త రోగాలను తెచ్చిపెడుతుంటాయి. తియ్యని శత్రువు మధుమేహం మన ఒంట్లో పేరుకుపోయి ఒక్కసారిగా బయటపడి భయపెడుతుంటుంది. ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధపెడుతున్న వ్యాధి షుగర్. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. డయాబెటిస్ క్యాపిటల్ గా మన హైదరాబాద్ మారుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే దీన్ని పూర్తిగా నివారించే మందు మనకు అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకూడదు.
Read Also: Health News: షుగర్ ఉన్న వాళ్ళు ఏం టిఫిన్ తినొచ్చు?
*చాలామంది వడలు తినాలని భావిస్తారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు కొన్నిరకాల వడలు ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా మినపప్పుతో చేసిన వడలు ఎక్కువగా తినకూడదు. అలసందలు, రాగులు, తృణధాన్యాలు, శనగల పిండితో చేసిన వాటిని కుక్కర్లో ఉడకబెట్టి నూనె వాడకుండా వడలుగా చేసుకుని తినవచ్చు.
* సాధారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఆహారం వైట్ బ్రెడ్. ధర కూడా తక్కువే. కానీ వైట్ బ్రెడ్‌లో చక్కెర శాతం, కార్బోహైడ్రేడ్లు అధికం. ఇవి మన శరీరంలో షుగర్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు దీన్ని పక్కన పెడితే మంచిది.
* హోల్ మిల్కు ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాలను మరింత పెంచేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు హోల్ మిల్క్‌తో పాటు పాలకోవ, మైసూర్‌పాక్ వంటి డైరీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
* మనం సాధారణంగా తెల్ల అన్నం ఎక్కువగా తింటాం. తెల్ల అన్నంలో కార్బోహైడ్రేడ్లు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ ఉన్నవాళ్లు వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
* డయాబెటిస్ పేషెంట్లు బంగాళాదుంపల జోలికి పోకూడదు. సాధారణంగా చాలా మంది బంగాళా దుంపలు తినడానికి ఇష్టపడరు. అవి ఎక్కువగా తింటే వాతంచేసే గుణం ఉంటుందని అంటారు. వాస్తవానికి షుగర్ లెవెల్స్‌ను పెంచేసే గుణం కూడా బంగాళాదుంపలకు ఉందని తేలింది. వీటికి దూరంగా ఉండాలి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.