NTV Telugu Site icon

Amla Benefits: ఉసిరి ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు..

ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఉసిరికాయ ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉసిరికాయ సహజంగా జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా, పొడవుగా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తూ తలకు పోషణనిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఉసిరి ఉపయోగం చాలా మంచిది.

Read Also: CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం.. స్టార్టప్‌లకు రూ. 25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..

జుట్టు కోసం ఆమ్లా నీరు:
జుట్టుకు ఉసిరిని ఉపయోగించాలనుకుంటే ఇంట్లో ఉసిరి నీటిని తయారు చేసుకోవచ్చు. దీనిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. కావాలంటే త్రాగవచ్చు. తద్వారా అంతర్గతంగా దాని ప్రయోజనాలను పొందుతారు. జుట్టుకు కూడా ఆమ్లా నీటిని అప్లై చేసుకోవచ్చు.

ఆమ్లా వాటర్ హెయిర్ మాస్క్:
ఆమ్లా వాటర్‌తో హెయిర్ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పొడవాటి, మందపాటి జుట్టు కోసం దీనిని ఉపయోగించాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు ఉంచాలి. తర్వాత.. గోరువెచ్చని నీరు,తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.