Health Tips: మైగ్రేన్ తలనొప్పి చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. మైగ్రేన్ తలనొప్పి బాధితులు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. చాలా మంది నొప్పిని భరించలేక చెవులు మూసుకుని తల వంచుకుని కూర్చుంటారు. ఈ బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. చిన్న శబ్ధం వినిపించినా భరించలేని బాధ. మైగ్రేన్ తలనొప్పి వస్తున్నప్పుడు వెలుతురును చూడటం కష్టంగా ఉంటుంది. వాంతులు అవుతాయి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ.. మైగ్రేన్లు ఎందుకు వస్తుంది అనేది ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఇది జన్యుపరమైన సమస్యల వల్ల వస్తుందని కొందరు, పర్యావరణ కారణాల వల్ల కొందరు అంటున్నారు. ఎక్కువ ఆలోచన చేయడం వల్ల అని మరికొందరు అంటుంటారు. ఖచ్చితమైన సమాధానం లేనందున మైగ్రేన్ యొక్క మూల కారణం ఇప్పటికీ రహస్యంగా ఉంది. ఇది తలలోని రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి భరించలేని తలనొప్పిని తెస్తుంది.
Read also: CEO Salary: గూగుల్ – టెస్లా సీఈవోల జీతం తెలిస్తే షాక్ అవుతారు.. సగటు ఉద్యోగుల కంటే 20 రెట్లు ఎక్కువ
మైగ్రేన్ బాధితులు తరచుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. ఈ నొప్పి సాధారణంగా ఒకవైపు విపరీతంగా ఉంటుంది. ఈ నొప్పి పురుషుల కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉండే ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల మాత్రలు వాడడంతో పాటు ఎవరెవరి సలహా ఇచ్చినా పాటిస్తాం. ఈ చిట్కాలు నొప్పిని పూర్తిగా నిరోధించలేవు కానీ కొంత ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి కొన్ని వంటగది చిట్కాలను చూద్దాం. అల్లం రసం, నిమ్మరసం మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు కొన్ని రోజుల పాటు తాగడం వల్ల తరచుగా వచ్చే మైగ్రేన్‌లను నివారించవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా లేదా అల్లం రసం కలిపి నుదుటిపై మర్దన చేయాలి. మైగ్రేన్ బాధితులు ఎక్కువగా నడవాలి, రోజుకు కనీసం రెండు కిలోమీటర్లు నడవాలి. ఒక కప్పు వేడి నీళ్లలో పుదీనా ఆకులతో బ్లాక్ టీని కలుపుకుని తరచుగా తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తలనొప్పి సమయంలో మెడపై ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాబట్టి చిన్నచిన్న చిట్కాలతో నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. నొప్పి భరించలేనప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
UtterPradesh Fire Accident: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మహిళతో సహా నలుగురు మృతి