Lancet study: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ముప్పు పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నాన్ -కమ్యూనికేట్ వ్యాధుల భారం చాలా ఎక్కువగా ఉంది. దేశంలో ఇప్పటికే 10.1 కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉంది. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. తాజాగా ది లాన్సెట్ పరిశోధనలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 13.4 శాతం అంటే దాదాపుగా 130 కోట్ల మందికి డయాబెటిస్ వ్యాధి ఉంటుందని హెచ్చరించింది.
Read Also: Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..
ఇది ప్రస్తుతం 2021లో ఉన్న 52.9 కోట్ల కంటే రెట్టింపు. రాబోయే 30 ఏళ్లలో ఏ దేశంలో కూడా వయస్సు-ప్రామాణిక మధుమేహం రేట్స్ తగ్గుముఖం పట్టడని అధ్యయనం పేర్కొంది. అవగాహన, మధుమేహాన్ని అణిచేందుకు ప్రయత్నాలు జరగుతున్నప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధుల్ని షుగర్ వ్యాధి అధిగమిస్తోంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో కూడా మధుమేహ వ్యాధి, అనారోగ్యం, మరణాల రేట్లు పెరుగుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. 2045 నాటికి మధుమేహం ఉన్నవారిలో మూడొంతుల మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తారని అంచనా వేసింది. వీరిలో 10 మందిలో ఒకరు మాత్రమే సమగ్ర మధుమేహ సంరక్షణను అందుకుంటారని పేర్కొంది. పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం.. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అసమానతలను పెంచింది.
డయాబెటిక్ అనేది ప్రస్తుత కాలంలో అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులో ఒకటని.. రాబోయే మూడు దశాబ్ధాల్లో ప్రతీ దేశంలో వయసు, లింగం, వర్గం అనే భేదం లేకుండా దూకుడుగా అభివృద్ధి చెందుతుందని ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకి తీవ్రమైన సవాల్ గా నిలుస్తుందని పరిశోధకులు తెలిపారు. ఏడేళ్లలోపు నాన్ కమ్యూనికేషన్ వ్యాధుల్ని 30 శాతం తగ్గించేందుకు, అట్టడుగు జనాభా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాని యూఎన్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మధుమేహం అసమాతనపై కీలక దృష్టి, అవగాహన అవసరం అని పరిశోధకురాలు శివానీ అగర్వాల్ (ఫ్లీషర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటిస్ అండ్ మెటబాలిజం) వెల్లడించారు.