షుగర్, బీపి వంటి దీర్ఘకాళిక రోగాలు ఒక్కసారి వస్తే మనల్ని వదిలి పెట్టవు.. ఇక జీవితాంతం వాటిని కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలి.. షుగర్ వస్తే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది.. షుగర్ ను తినడమే పూర్తిగా మానెయ్యాల్సి ఉంటుంది.. చక్కెర తినకపోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని అనుకుంటారు. కానీ జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం మూలంగా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా తినడం, త్రాగడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్‌ని డయాబెటిస్ డైట్‌లో ఉంచుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా వరకు తగ్గుతాయి…
వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక గింజలు, ఎండిన పండ్లు, విత్తనాలు కూడా ఉంటాయి.. అంజీరాలను తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అంజీర్ పండ్లలో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్లు సి, కె, ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి..
ఇకపోతే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ పండు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. వీటిలో పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంది. ఇది మధుమేహం చికిత్సకు మంచిది. అంజీర్ పండ్లలో కూడా సహజ చక్కెరలు ఉంటాయి.. అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలతో సహా మిగిలిన కణాలపై రక్షిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది.. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సాయపడుతుంది.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.