NTV Telugu Site icon

Health Tips : నడుం నొప్పితో భాధపడుతున్నారా? మీ కోసమే ఈ ఆసనాలు…

Nadumnoppi

Nadumnoppi

చాలా మందికి వర్క్ ఫ్రమ్ చెయ్యడం వల్ల నొప్పి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిస్క్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు.. కానీ అన్నిటి కన్నా కూడా యోగా చెయ్యడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.. అంతేకాదు ఫిట్ గా కూడా ఉంటారు.. యోగా చెయ్యడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

యోగా మన చర్మానికి కొత్త మెరుపు, కాంతిని అందిస్తుంది. అంతే కాకుండా.. అనేక వ్యాధులలో మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. వివిధ యోగా భంగిమలు మన శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగించే 3 అటువంటి ఆసనాల గురించి ఈ ఆర్టికల్ లో చెప్తున్నాం..

యోగాను క్రమం తప్పకుండా చేయడం వల్ల మన శరీరం నుండి అనేక వ్యాధులు తొలగిపోతాయి. మీరు శరీర నొప్పికి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే, యోగా క్రమంగా నొప్పిని తగ్గిస్తుంది.. వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటే, కూర్చోవడం, నిలబడటం కష్టంగా ఉన్నట్లయితే, ఈ మూడు యోగా ఆసనాలు వెన్నునొప్పికి దివ్యౌషధంగా నిరూపిస్తాయి. వెన్నునొప్పిని వదిలించుకోవడానికి భుజంగాసనం చాలా ప్రభావవంతమైన ఆసనంగా నిరూపించబడింది.. ఈ ఆసనం ను వెయ్యాలంటే కూర్చొని వెనుక కాళ్లను పట్టుకోవాలి..

శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోండి, లోతైన శ్వాస తీసుకోండి..శలభాసన కూడా పొట్ట మీద పడుకుని చేస్తారు. ఇందులో, మీరు మీ పొట్టపై పడుకుని, మీ రెండు చేతుల అరచేతులను తొడల క్రింద ఉంచాలి, ఆపై రెండు పాదాల మడమలను ఒకదానికొకటి తీసుకుని, మీ కాలి వేళ్లను నిటారుగా ఉంచాలి, ఆపై మీ కాళ్ళను నెమ్మదిగా పైకి ఎత్తాలి. కాళ్లను పైకి కదుపుతూ లోతైన శ్వాస తీసుకోండి.. ఇలా చెయ్యడం వల్ల కూడా నొప్పి త్వరగా తగ్గుతుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.