మన శరీరం పగలంతా ఏదొక పనివల్ల కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకుంటేనే తర్వాత రోజూ బాగా పని చేస్తారు.. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా బీపీ తగ్గుతుంది. శరీరం బలహీనంగా తయారవుతుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే తగినంత నిద్రపోకపోవడం వల్ల మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణంగా మనం పని చేసేటప్పుడు మన శరీర అవయవాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది…
సాధారణంగా రోజుకు మనం 6 నుండి 8 గంటల పాటు నిద్రించడం వల్ల మన శరీర అవయవాలకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. దాంతో మనం తిరిగి ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. కానీ మనలో చాలా రోజూ తగినంతగా నిద్రించడం లేదు.దానివల్ల అవయవాలకు తగినంత విశ్రాంతి లభించక చాలా మంది ఉత్సాహంగా పని చేసుకోలేకపోతున్నారు. అలాగే సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కళ్లు ఎర్రబడడం, కళ్లు లోపలికి పోవడం, కళ్లు మూతలు పడడం, ముఖ కవలికలు మారిపోవడం జరుగుతుంది..
మనం రోజూ ఎంత చక్కటి ఆహారాన్ని తీసుకున్నప్పటికి నిద్రించకపోవడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే మన ఆయుష్షు కూడా తగ్గుతుంది. కనుక మనం ఆహారానికి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తామో నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. కనీసం ఆరు గంటలు తప్పనిసరి నిద్ర పోవాలి..రాత్రి పూట గాఢ నిద్ర రావాలంటే సాయంత్రం 7 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. సాయంత్రం భోజనంలో పండ్లు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి మంచి నిద్ర వస్తుంది.. మరో ముఖ్యమైన విషయం రాత్రిళ్ళు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. అప్పుడే హాయిగా నిద్ర పోతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.