ఒకప్పుడు మగవారి డ్రెస్సింగ్ లో పంచెలు కట్టుకొనే వారు.. రాను రాను కల్చర్ మారడంతో ఫ్యాంట్స్ వేసుకోనేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది అందరు స్కిన్ టైట్ డ్రెస్సులు, జీన్స్లు వేస్తున్నారు. తమ ఇష్టాలు, అనుకూలతలను బట్టి జీన్స్ వేసుకుంటారు. ఈ క్రమంలోనే చర్మానికి అతుక్కుపోయేలా కొన్ని జీన్స్ ఉన్నాయి. వాటిని స్కిన్ టైట్ జీన్స్ అంటారు.. అయితే వాటిని వేసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం…
స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఎవరికైనా తొడలు, పిరుదులు, నడుం తదితర భాగాల్లో ఉండే కొవ్వు పైకి వస్తుంది. దీంతో ఆ కొవ్వు ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. అప్పుడది హార్ట్ స్ట్రోక్స్, ఊపిరితిత్తులు, జీర్ణాశయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది. పురుషుల్లో అయితే స్కిన్ టైట్ జీన్స్ వల్ల వృషణాలు దెబ్బ తింటాయి. అక్కడి నరాలు బాగా చెడిపోతాయి. దీంతో వీర్యం సరిగ్గా ఉత్పత్తి కాదు. ఇది సంతాన సాఫల్యత పై ప్రభావం చూపుతుంది.. దాంతో పిల్ల లు పుట్టే అవకాశాలు తగ్గుతాయి..ఇక అంతేకాదు, అలాంటి పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు..
ఇంకా కాళ్ల కండరాలు దెబ్బ తింటాయి.. వాటికి రక్త ప్రసరణ కూడా సరిగ్గా అందదు..రక్తం క్లాట్ అవుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. కాళ్ల లో నరాలు దెబ్బ తిని వాపులకు గురవుతాయి. బాగా నొప్పి ఉంటుంది. స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల రక్తంలో ఉండే క్రియేటిన్ కైనేజ్ ఎంజైమ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో అది కండరాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కిడ్నీలు కూడా చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. స్కిన్ టైట్ జీన్స్ వల్ల శరీర ఆకృతి లో మార్పు వస్తుంది…కొవ్వు కూడా ఎక్కడిక్కడ పెరిగిపోతుంది.. అందుకే టైట్ జీన్స్ వేసేవాళ్లు మాత్రం వీటిని దృష్టిలో ఉంచుకొని జీన్స్ వేసుకొనే ముందు వీటిని చూసి తర్వాత వేసుకోవడం మంచిది..