Site icon NTV Telugu

Health Tips : వీటిని మళ్లీ వేడి చేసుకొని తింటున్నారా? రోగాలను కొని తెచ్చుకున్నట్లే..

Food

Food

వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

చికెన్..పోషకాల గని. ప్రొటీన్‌ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్‌ రూపాంతరం చెందుతుంది. కొంతమేర ప్రమాదకరంగా మారుతుంది… అంతేకాదు విషంగా కూడా మారుతుంది.. దాని వల్ల జీర్ణం అవ్వదు..

అన్నం..అప్పుడే వండిన అన్నాన్ని చల్లబరిచి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. మరుసటి రోజు వేడి చేసుకునీ తినొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ రోజులు, మరిన్నిసార్లు వేడి చేయడం మంచిది కాదు. బయటి వాతావరణంలో ఉంచినప్పుడు హానికర బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..
ఇకపోతే సీ ఫుడ్..చేపలు, రొయ్యలు మొదలైన సముద్ర ఆహారం.. తాజాగానే రుచికరం. నిల్వ ఉంచితే జిహ్వకు రుచించదు. పోషకాలు కూడా తగ్గిపోతాయి. అతిగా వేడిచేసిన సముద్ర ఆహారం కొందరిలో దురదలను కలిగిస్తాయి..
గుడ్డు తో చేసిన కూరలను అస్సలు వేడి చెయ్యడం మంచిది కాదు..ఎందుకంటే అందులో ఉండే ప్రోటీన్స్ పోతాయి..-ప్రొటీన్‌ ఫుడ్‌లో నైట్రోజన్‌ ఎక్కువగా ఉంటుంది. అతిగా వేడిచేయడం వల్ల అది ఆక్సిడైజ్‌ అవుతుంది. క్యాన్సర్‌కు దారితీస్తుంది..
అలాగే.. పాలకూర పప్పు, పాలక్‌ పనీర్‌, పాలకూర పచ్చడి వేడిచేసిన కొద్దీ నైట్రోసమైన్స్‌గా మారతాయి. క్యాన్సర్‌కు దారితీస్తాయి…
మష్రూమ్స్‌ను వండుకునే తినాలి. కానీ, మళ్లీ మళ్లీ వేడిచేయడం మాత్రం సరైన పద్ధతి కాదు. సరైన వాతావరణంలో నిలువ చేయకపోతే మాత్రం.. తినగానే పొట్టలో గడబిడ మొదలవుతుంది.. వీటితో పాటు ఆలు, అలాగే బీట్ రూట్.. దుంప కూరలను ఎక్కువగా వేడి చేసి తినకూడదు అనే సంగతి గుర్తు పెట్టుకోండి..

Exit mobile version