Health Tips : వీటిని మళ్లీ వేడి చేసుకొని తింటున్నారా? రోగాలను కొని తెచ్చుకున్నట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
చికెన్..పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర ప్రమాదకరంగా మారుతుంది… అంతేకాదు విషంగా కూడా మారుతుంది.. దాని వల్ల జీర్ణం అవ్వదు..
Also Read
అన్నం..అప్పుడే వండిన అన్నాన్ని చల్లబరిచి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. మరుసటి రోజు వేడి చేసుకునీ తినొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ రోజులు, మరిన్నిసార్లు వేడి చేయడం మంచిది కాదు. బయటి వాతావరణంలో ఉంచినప్పుడు హానికర బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..
ఇకపోతే సీ ఫుడ్..చేపలు, రొయ్యలు మొదలైన సముద్ర ఆహారం.. తాజాగానే రుచికరం. నిల్వ ఉంచితే జిహ్వకు రుచించదు. పోషకాలు కూడా తగ్గిపోతాయి. అతిగా వేడిచేసిన సముద్ర ఆహారం కొందరిలో దురదలను కలిగిస్తాయి..
గుడ్డు తో చేసిన కూరలను అస్సలు వేడి చెయ్యడం మంచిది కాదు..ఎందుకంటే అందులో ఉండే ప్రోటీన్స్ పోతాయి..-ప్రొటీన్ ఫుడ్‌లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అతిగా వేడిచేయడం వల్ల అది ఆక్సిడైజ్ అవుతుంది. క్యాన్సర్‌కు దారితీస్తుంది..
అలాగే.. పాలకూర పప్పు, పాలక్ పనీర్, పాలకూర పచ్చడి వేడిచేసిన కొద్దీ నైట్రోసమైన్స్గా మారతాయి. క్యాన్సర్‌కు దారితీస్తాయి…
మష్రూమ్స్‌ను వండుకునే తినాలి. కానీ, మళ్లీ మళ్లీ వేడిచేయడం మాత్రం సరైన పద్ధతి కాదు. సరైన వాతావరణంలో నిలువ చేయకపోతే మాత్రం.. తినగానే పొట్టలో గడబిడ మొదలవుతుంది.. వీటితో పాటు ఆలు, అలాగే బీట్ రూట్.. దుంప కూరలను ఎక్కువగా వేడి చేసి తినకూడదు అనే సంగతి గుర్తు పెట్టుకోండి..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?