మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాయి.. అయితే ఉదయాన్నే కొన్ని రకాల పానీయాలను తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక వేసుకోండి..
*. క్రాన్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చక్కెర కలపకుండా క్రాన్బెర్రీ జ్యూస్‌ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే గుండెకు మరింత మేలు జరుగుతుంది.. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది..
*. క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంతో పాటు రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలను కూడా వెంటనే తగ్గిస్తుంది..
*. అలాగే బీట్‌రూట్ జ్యూస్ నైట్రేట్‌లతో సహా అనేక రకాల పోషకాలకు పవర్‌హౌస్. ఇది రక్త నాళాలను విస్తరించి రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా ఉదయాన్నే బీట్‌రూట్ రసం తాగడం వల్ల మీ గుండెకు కూడా మేలు జరుగుతుంది.. బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు..
*. ఇకపోతే ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే శరీరానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు గుండెపోటు రాకుండా కాపడుతుంది..అదే విధంగా అధిక బరువును తగ్గించడంతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తగ్గిస్తుంది..
*. చివరగా పసుపులోని కర్కుమిన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి అన్ని రకాల వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే కడుపులో మంట, గుండె మంట, గుండె పోటు ప్రమాదాలను తగ్గిస్తాయి… ఇంకా బోలెడు లాభలున్నాయి.. మీరు కూడా ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.