నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు .. ముఖ్యంగా అధిక బరువును తగ్గుతారు.. అయితే చల్లని నీళ్లను తాగితే అధిక బరువు పెరుగుతారని కొందరు నమ్ముతుంటారు.. అలా ఏమి ఉండదని ఆరోగ్య నిపుణులు.. కాలాన్ని బట్టి తీసుకోవడం మంచిది.. ముఖ్యంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు.. ఈ చల్లని నీళ్లను తీసుకోవడం వల్ల ఎమౌతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు ప్రతిరోజూ కనీసం 3.7 లీటర్లు నీరు తాగాలి. 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు ప్రతిరోజూ కనీసం 2.7 లీటర్లు నీరు తాగాలి. గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలకు దీని కంటే ఎక్కువ నీరు అవసరం. సరిపడ నీరు తీసుకోవడం వల్ల రోజంతా తాజాగా, శక్తిగా ఉండొచ్చు.. అయితే చల్లని నీళ్లను ఎక్కువగా తాగితే అధిక బరువు పెరిగే అవకాశం ఉందని కొందరు అపోహ పడుతుంటారు.. అందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు..
నిజానికి నీటిలో ఎటువంటి క్యాలరీలు లేవు.. బరువును పెంచదు. కానీ చల్లని నీరు తీసుకుంటే మాత్రం ఇతర సమస్యలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా చల్లటి నీరు ఎక్కువగా తీసుకుంటే.. గ్యాస్, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. గొంతులో నొప్పి లేదా వాపు పెరుగుతుంది. తలనొప్పి సమస్య వేధిస్తుంది. పంటి నొప్పి లేదా సున్నితత్వం పెరుగుతుంది.. ఇప్పుడు చలి కాబట్టి మరీ చల్లని నీళ్లు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.