ప్రస్తుత కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు మనం చూస్తూనేవున్నాం. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు రావడం లాంటి అనేక సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీ వస్తుంది అని ,మాత్రమే ఎక్కువమందికి తెలుసు. కానీ చెక్కర ఎక్కువ తీసుకున్న గాని గుండెకు ప్రమాదం అని చాలా తక్కువమందికి తెలుసు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తగ్గించాలి:
1. జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్,న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2. ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. వీటిలో ఆహారాన్ని ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇవి గుండెకి మంచివి కావు. వీటివల్ల గుండె జబ్బులు వస్తాయి. కనుక ఈ ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి.
3. ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మంచిది కాదు. దీనివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. అంతేకాకుండా చివరకు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. అదే క్రమంలో చక్కెర వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అది కూడా గుండె జబ్బులు వచ్చేందుకు దారి తీస్తుంది. కనుక ఈ రెండు పదార్థాలను నిత్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఉప్పు, చక్కర తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.