ఐస్ క్రీమ్ తర్వాత అందరు ఎక్కువగా ఇష్టపడేది కూల్ డ్రింక్స్.. కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప… ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది. మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది.. బరువు పెరుగుతారు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలేత్తుతాయని చెబుతున్నారు.. అవేంటో వివరంగా తెలుసుకుందాం..
*. మెగ్నీషియం ఎముకల నిర్మాణంలో భాగం అవుతుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
*. ఇది మూత్రపిండాలలో కాల్షియం ఆరోగ్యకరమైన సంతులనాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది, ఇది ఎముకలు నష్టం నుంచి రక్షిస్తుంది, శరీరంలో యాసిడ్-బేస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
*. పండ్లు కూరగాయల్లో సమృద్ధిగా లభించే విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఎముకలు విరిగిపోకుండా కాపాడుతుంది..
*. ఇక ఎముకల పెరుగదలకు ఫాస్ఫరస్ ముఖ్యమైనది, ఎముకల అభివృద్ధికి తగినంత ఫాస్ఫరస్ తీసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ సీరం ఫాస్ఫేట్ స్థాయిలు పోషకాహార లోపాన్ని సూచిస్తాయి, ఇది ఎముకల పగుళ్లు, బోలు ఎముకల ప్రమాదాన్ని పెంచుతుంది.
*.ఆకు కూరలలో ఉండే విటమిన్ K కార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇది ఎముక ప్రోటీన్‌లను సక్రియం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
*. మానవ శరీరం ఎప్పుడూ దృడంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం.. కూల్ డ్రింక్స్ తాగితే ప్రోటీన్ లోపం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక వీటికి బదులుగా పుచ్చకాయ, కర్బూజ పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిలోనూ చక్కెర లేకుండా తాగితే మరీ మంచిది. సాధ్యమైనంత వరకు మంచి నీటిని ఎక్కువగా తాగేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.