Sports Injuries : జిమ్‌కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
- యువతలో పెరుగుతున్న కామన్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్
- చిన్న నొప్పిని నిర్లక్ష్యం చేస్తే భారీ సమస్యలు
- వర్కౌట్ ముందు వార్మప్ ఎందుకు తప్పనిసరి?
- ఇంజ్యూరీ అయితే వెంటనే పాటించాల్సిన PRICE రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sports Injuries : ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌పై అవేర్నెస్ పెరగడంతో జిమ్‌లకు వెళ్లేవారి సంఖ్య, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసే యువత సంఖ్య బాగా పెరిగింది. వర్కౌట్స్ చేయడం, ఆటలు ఆడటం హెల్త్‌కి చాలా మంచిదే అయినప్పటికీ.. సరైన పద్ధతులు పాటించకపోతే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ (క్రీడా గాయాలు) బారిన పడే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని స్పోర్ట్స్ ఇంజ్యూరీ సెంటర్లో సీనియర్ ప్రొఫెసర్ , ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ స్కంద్ సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం.. రాంగ్ బాడీ పోస్చర్ (తప్పుడు శరీర భంగిమ), వార్మప్ చేయకుండా డైరెక్ట్‌గా హెవీ వర్కౌట్స్ స్టార్ట్ చేయడం, బాడీ కెపాసిటీకి మించి ఓవర్ లోడ్ వేయడం వల్లే ఎక్కువ మంది గాయాలపాలవుతున్నారు. మరి ఈ ఇంజ్యూరీస్ కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
- Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ "హోమ్ రెమిడీ".. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
- Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్‌బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
- Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే చాలు!
యువతలో ఎక్కువగా వచ్చే కామన్ ఇంజ్యూరీస్ ఇవే!
డాక్టర్ స్కంద్ సిన్హా ప్రకారం.. ఇటీవలి కాలంలో యూత్‌లో లిగమెంట్ ఇంజ్యూరీస్ (Ligament Injuries), కండరాల బెణుకులు, మోకాలి నొప్పులు, షోల్డర్ ఇంజ్యూరీస్ , బ్యాక్ పెయిన్ వంటి ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. జిమ్‌లో ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఎక్సర్సైజులు చేయడం, బాడీకి రెస్ట్ ఇవ్వకుండా ఓవర్ ట్రైనింగ్ తీసుకోవడం వల్లే ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరి బాడీ స్ట్రెంగ్త్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి, ఎవరి శరీరానికి సూట్ అయ్యే వెయిట్స్తో వారు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
చిన్న నొప్పే కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.!
వర్కౌట్ చేస్తున్నప్పుడు లేదా ఆడుతున్నప్పుడు వచ్చే చిన్న చిన్న నొప్పులను, వాపులను చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ప్రారంభ దశలోనే వాటిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో అవి సీరియస్ ప్రాబ్లమ్స్‌గా మారే ప్రమాదం ఉంది. బాడీలోని ఏదైనా పార్ట్‌ని మూవ్ చేయడంలో ఇబ్బందిగా ఉన్నా, లేదా పెయిన్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతున్నా అస్సలు వెయిట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. స్టార్టింగ్‌లోనే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లాంగ్-టర్మ్ ఇష్యూస్ రాకుండా సేఫ్ అవ్వచ్చు.
వర్కౌట్‌కు ముందు ‘వార్మప్’ ఎందుకు మస్ట్?
ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేదా హెవీ వర్కౌట్ స్టార్ట్ చేయడానికి ముందైనా కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు ఖచ్చితంగా వార్మప్ (Warm-up) , స్ట్రెచింగ్ చేయాలి. ఇది మీ కండరాలను, జాయింట్స్‌ని హెవీ ఎక్సర్సైజుల కోసం ప్రిపేర్ చేస్తుంది. వార్మప్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, మజిల్స్ ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. దీనివల్ల ఇంజ్యూరీస్ అయ్యే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి వార్మప్ సెషన్ కంప్లీట్ అయ్యాకే మెయిన్ వర్కౌట్ లోకి వెళ్లాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఒకవేళ గాయమైతే వెంటనే ఏం చేయాలి? (PRICE ప్రొటోకాల్)
- రెస్ట్: గాయపడిన శరీర భాగానికి అస్సలు లోడ్ వేయకుండా కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి.
- ఐస్ ప్యాక్: వాపు , నొప్పిని తగ్గించడానికి గాయమైన చోట ఐస్ ముక్కలతో కాపడం పెట్టాలి.
- కంప్రెషన్: గాయం తీవ్రత పెరగకుండా ఉండటానికి ఒక కాటన్ బ్యాండేజ్‌ను మెల్లగా కట్టాలి.
- ఎలివేషన్: వాపు త్వరగా తగ్గాలంటే గాయపడిన భాగాన్ని గుండె కంటే కాస్త పైకి ఎత్తి ఉంచాలి.
- ఒకవేళ నొప్పి లేదా వాపు తగ్గకుండా ఇంకా పెరుగుతుంటే మాత్రం వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలి.
ఇంజ్యూరీస్ కాకుండా ఫిట్‌గా ఉండటానికి సింపుల్ టిప్స్:
స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఎప్పుడూ హెల్తీగా, ఫిట్‌గా ఉండాలంటే ఈ బేసిక్ రూల్స్ మైండ్‌లో పెట్టుకోండి. ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఎప్పుడూ పర్ఫెక్ట్ ఫామ్ , రైట్ టెక్నిక్ ఉపయోగించాలి. బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం రెగ్యులర్‌గా స్ట్రెచింగ్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. వారంలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు బాడీ రికవరీ కోసం కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి. వీటన్నింటితో పాటు ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం , డైలీ 7 నుండి 8 గంటల ప్రాపర్ స్లీప్ (నిద్ర) ఉండటం చాలా అవసరం. ఏ రకమైన పెయిన్ వచ్చినా బాడీ ఇచ్చే ఆ సిగ్నల్స్‌ను అస్సలు ఇగ్నోర్ చేయకండి.
తాజావార్తలు
-
Sports Injuries : జిమ్‌కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
-
Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
-
Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్‌తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!