Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్‌తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
- ఫోన్ ఛార్జింగ్ వల్ల కార్ మైలేజ్‌పై ఎంత ప్రభావం?
- బ్లూటూత్ వాడితే పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుందా?
- కార్లో అసలు పవర్ ఎక్కువ తినే డివైసెస్ ఇవే
- మైలేజ్ పెంచుకోవాలంటే డ్రైవర్లు పాటించాల్సిన టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Mileage Tips : డ్రైవింగ్ చేసేటప్పుడు కార్ లో మొబైల్ ఛార్జింగ్ పెట్టాలన్నా, లేదా బ్లూటూత్ (Bluetooth) ఆన్ చేసి సాంగ్స్ వినాలన్నా చాలా మంది కాస్త ఆలోచిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంజన్‌పై లోడ్ పడి కార్ మైలేజ్ తగ్గిపోతుందని, పెట్రోల్/డీజిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని ఒక కామన్ మిత్ (అపోహ) జనాల్లో ఉంది. అయితే లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఈ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తేలింది. మనం వాడే స్మార్ట్‌ఫోన్స్, బ్లూటూత్ వల్ల కార్ ఫ్యూయల్ ఎకానమీపై ఎలాంటి ఇంపాక్ట్ పడదనే నిజాలను నిపుణులు క్లియర్ కట్‌గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
మనం కార్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ పవర్ కార్ లోని ఆల్టర్నేటర్ (Alternator) నుండి వస్తుంది. ఈ ఆల్టర్నేటర్ ఇంజన్ సాయంతో రన్ అవుతుంది. అయితే, కార్ హైవే స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఇంజన్ వేల వాట్ల (Watts) ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దానితో పోలిస్తే ఒక ఫోన్ ఛార్జర్ తీసుకునే పవర్ చాలా చాలా తక్కువ. దీనివల్ల కార్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కేవలం 0.03 పర్సెంట్ మాత్రమే తగ్గుతుంది.
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ఒకవేళ మీరు మీ ఫోన్‌ను కంప్లీట్‌గా 0% నుండి 100% వరకు కార్ లోనే ఛార్జ్ చేసినా సరే.. దానికయ్యే ఎక్స్ట్రా ఫ్యూయల్ కాస్ట్ 1 డాలర్ (దాదాపు 80 రూపాయలు) కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి మీ మంత్లీ బడ్జెట్‌పై దీని ఎఫెక్ట్ అస్సలు ఉండదు. కార్ లోని స్టాండర్డ్ బ్లూటూత్ మోడ్యూల్ పనిచేయడానికి కేవలం 2.5 మిల్లీవాట్ల పవర్ సరిపోతుంది. ఇది ఆల్టర్నేటర్పై జీరో పర్సెంట్ ప్రెజర్‌ని క్రియేట్ చేస్తుంది. రియల్ వరల్డ్‌లో దీనివల్ల మైలేజ్ తగ్గడం అనేది అస్సలు జరగదు.
అసలు కార్ లో ఫ్యూయల్ కన్సప్షన్ని పెంచేవి ఇవే.!
మనం ఫోన్ చార్జర్లు, బ్లూటూత్‌లు బంద్ చేసినా పెద్దగా యూజ్ ఉండదు. ఎందుకంటే కార్ లో అసలు సిసలైన పవర్ హంగ్రీ డివైసెస్ వేరే ఉన్నాయి. డాష్ బోర్డ్ పై ఉండే పెద్ద పెద్ద టచ్ స్క్రీన్ డిస్ప్లేలు నడవడానికి 20 నుండి 50 వాట్ల పవర్ అవసరమవుతుంది. ఇది బ్లూటూత్ కంటే ఎక్కువే అయినా, మిగతా సిస్టమ్స్‌తో పోలిస్తే తక్కువే. నైట్ టైమ్ కార్ హెడ్‌లైట్స్ ఆన్ చేసినప్పుడు, అవి ఫోన్ ఛార్జర్ కంటే ఎక్కువ పవర్‌ని లాగుతాయి. దీనివల్ల ఇంజన్‌పై కాస్త డ్రాగ్ (లోడ్) పెరుగుతుంది. కార్ క్యాబిన్ లో ఉండే అన్ని ఎలక్ట్రానిక్స్ కలిపి వాడే పవర్ కంటే.. ఏసీ కంప్రెషర్ ఏకంగా 10 రెట్లు ఎక్కువ ఇంజన్ పవర్‌ని వాడుకుంటుంది. కార్ మైలేజ్ దారుణంగా పడిపోవడానికి మెయిన్ రీజన్ ఈ ఏసీయే.
చివరగా తేలింది ఏంటంటే.. మీ కార్ మైలేజ్ సేవ్ చేసుకోవాలని ఉంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్‌ప్లగ్ చేయడం కంటే, కార్ ఏసీ (Climate Control) వాడకాన్ని మేనేజ్ చేయడం , స్పీడ్ కంట్రోల్లో డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ఇకపై ఎలాంటి భయం లేకుండా జర్నీలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బ్లూటూత్‌లో మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు..
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!