Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
- జరీలో బంగారం, వెండి
- పరిశోధనలో ఆసక్తికర విషయాలు
- అసలైన జరీని గుర్తించేదెలా?
- అమ్మే ముందు జాగ్రత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో, ఇళ్లలో చాలా కాలంగా వాడకుండా పడి ఉన్న పాత పట్టు చీరలపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకల కోసం చాలా ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన కాంచీపురం వంటి సాంప్రదాయ పట్టు చీరల అంచులో లేదా డిజైన్‌లో బంగారం, వెండి కలిసి ఉండే అవకాశం ఉంది. అయితే ఒక పట్టు చీరలో నిజానికి ఎంత బంగారం, వెండి ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, అమ్మే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి.
జరీ ఎలా తయారు చేస్తారు.. నకిలీ లేసుల జాగ్రత్త
కొన్ని సాంప్రదాయ పట్టు చీరలలో వాడే లేస్ లేదా జరీ దారాల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంచీపురం, బనారస్ వంటి ప్రాంతాల్లో తయారుచేసే పాత, ఖరీదైన పట్టు చీరల్లో అసలైన జరీని ఉపయోగించి ఉండవచ్చు. సాధారణంగా వెండి, రాగి మిశ్రమలోహంతో చేసిన చదునైన తీగను పట్టు దారం చుట్టూ చుట్టి, ఆ తీగ ఉపరితలంపై బంగారంతో ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. దీనివల్లే చీర అంచుకు, డిజైన్‌కు బంగారు మెరుపు వస్తుంది. అయితే నేటి మార్కెట్లో అసలైన లోహపు జరీతో పాటు కృత్రిమ లేదా సింథటిక్ లేసులను కూడా ఉపయోగిస్తున్నారు. అందువల్ల మెరిసే ప్రతి లేసూ నిజమైన బంగారం కాదని గుర్తుంచుకోవాలి.
Also Read
- Healthy Cooking: ఫ్రిజ్‌లో పెట్టిన చపాతీ పిండి పాడవకుండా ఉండాలా? ఈ సింపుల్ హెల్తీ టిప్‌ను ఫాలో అవ్వండి!
- Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
- Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
- Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
పరిశోధన ప్రకారం చీరలో ఉండే బంగారం, వెండి పరిమాణం
2022లో టెక్స్టైల్ అండ్ లెదర్ రివ్యూ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, జరీలో విలువైన లోహాల శాతం డిజైన్, తయారీ కాలం, లోహ నాణ్యతను బట్టి మారుతుంది. సెంట్రల్ సిల్క్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్టీఆర్ఐ) పరిశోధకులు ఆరణి, కాంచీపురం, సూరత్ తదితర ప్రాంతాల నుంచి సేకరించిన 68 అసలైన జరతారి నమూనాలను ఎక్స్ఆర్ఎఫ్ టెక్నాలజీతో విశ్లేషించారు. ఆ విశ్లేషణలో నమూనాల వారీగా బంగారం శాతం 0.04 శాతం నుంచి 0.58 శాతం వరకు, వెండి శాతం 12.80 శాతం నుంచి 70.07 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. సగటున 0.22 శాతం బంగారం, 26.37 శాతం వెండి ఉన్నట్లు తేలింది. ఆరు మీటర్ల పొడవున్న జరీ పనితనం ఉన్న బ్రోకేడ్ చీర నేయడానికి కనీసం 240 గ్రాముల జరీ అవసరమవుతుందని, ఆ లెక్కన అందులో సుమారు 0.53 గ్రాముల బంగారం, 63.29 గ్రాముల వెండి ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.
ఏ చీరల్లో ఎక్కువ అవకాశం.. ఎక్స్ఆర్ఎఫ్ పరీక్ష ఎలా?
అంచుతో పాటు చీర మొత్తం దట్టమైన జరీ నేత కలిగిన సాంప్రదాయ కాంచీపురం పట్టు చీరలు, బనారస్ బ్రోకేడ్ చీరలలో బంగారం, వెండి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సింథటిక్ లేస్ కూడా నిజమైన జరీలాగే కనిపిస్తుంది కాబట్టి, కేవలం చూసి నిజమైనదో కాదో చెప్పడం కష్టం. చీరకు ఎలాంటి నష్టం కలగకుండా కంప్యూటరైజ్డ్ ఎక్స్ఆర్ఎఫ్ పరీక్ష ద్వారా అందులో ఉన్న లోహ పరిమాణాన్ని నిర్ధారించవచ్చు. ఇంట్లో రసాయనాలు లేదా ఆమ్లాలతో ప్రయోగాలు చేయడం, ఆన్లైన్ వీడియోలు చూసి సొంతంగా పరీక్షలు చేయడం అత్యంత ప్రమాదకరం. అధీకృత పరీక్షా కేంద్రాలు లేదా నిపుణుల వద్దకు తీసుకెళ్లడమే సురక్షితం.
పాత పట్టు చీరను అమ్మే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
చీర మొత్తం బరువులో పట్టు దారం బరువు కూడా కలిసి ఉంటుంది కాబట్టి, చీర బరువును జరీ బరువుగా భావించకూడదు. ముందుగా ఎక్స్ఆర్ఎఫ్ పరీక్ష ద్వారా అది అసలైన జరీనా కాదా, అందులో ఎంత బంగారం లేదా వెండి ఉందో నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఒకరి వద్దే కాకుండా పలువురు నమ్మకమైన డీలర్లను సంప్రదించి సరైన విలువను తెలుసుకోవాలి. తొందరపడి చీరను అమ్మడం లేదా పాడుచేయడం కాకుండా, శాస్త్రీయంగా విలువ నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
-
Kieron Pollard: ‘పాత్రలు మాత్రమే మారాయి, లక్ష్యం ఒక్కటే’.. రోహిత్ శర్మ రీఎంట్రీపై పొలార్డ్ రియాక్షన్..
-
Healthy Cooking: ఫ్రిజ్‌లో పెట్టిన చపాతీ పిండి పాడవకుండా ఉండాలా? ఈ సింపుల్ హెల్తీ టిప్‌ను ఫాలో అవ్వండి!
-
Chinese Manja: మంగళ్‌హాట్‌లో చైనీస్ మాంజా ముఠా గుట్టురట్టు.. రూ. 2.40 లక్షల సొత్తు స్వాధీనం
-
Tata Sons Board Meeting: నోయెల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్.. రేపటి బోర్డు మీటింగ్‌లో ఏం జరగబోతోంది?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!