హైదరాబాద్‌లో జూలై 12న GBT సీజన్-3 కర్టెన్ రైజర్.. మహిళా సాధికారతకు మరో అడుగు
- జూలై 12న హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
- సినీ, ఫ్యాషన్ రంగ ప్రముఖుల హాజరు
- మహిళల ప్రతిభకు అంతర్జాతీయ వేదిక
- Prikus Digital భాగస్వామ్యంతో నిర్వహణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపుదలకు వేదికగా నిలుస్తున్న Global Beauty Treasure (GBT) Season – 3 కర్టెన్ రైజర్ కార్యక్రమం జూలై 12న హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ప్రముఖ మోడల్స్, బ్యూటీ క్వీన్స్, పెజెంట్ రంగ నిపుణులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఫ్యాషన్ మరియు బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులు, కార్పొరేట్ భాగస్వాములు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, విశిష్ట అతిథులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
Mrs. India International – 2022 విజేత, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ వ్యవస్థాపకురాలు సుహాసిని పాండ్యం మాట్లాడుతూ, “గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్-3 మరో స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి నాంది పలుకుతోంది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం. టీమ్ GBT అంకితభావంతో ఈ సీజన్‌ను మరింత విజయవంతంగా నిర్వహిస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. అందరి సహకారంతో ఈ సీజన్‌ను చిరస్మరణీయంగా తీర్చిదిద్దుతాం” అని పేర్కొన్నారు.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ (GBT) సీజన్-3 కార్యక్రమానికి Prikus Digital స్ట్రాటజిక్ & డిజిటల్ పార్ట్నర్గా వ్యవహరిస్తూ, ఈవెంట్ బ్రాండింగ్, ప్రమోషన్స్, పబ్లిక్ రిలేషన్స్, నిర్వహణ బాధ్యతలను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ పాషా, Prikus CEO ప్రమీల్ అర్జున్, Skillvedha Innovations CTO సందీప్ అవుటపల్లి, వాసవి ఇన్నోవేషన్స్ అధినేత మెహర్ తేజ, ప్రముఖ రైఫిల్ షూటర్ పి. భువనేశ్వరి, Prikus Digital బృందం, టీమ్ GBT సభ్యులు కలిసి సుహాసిని పాండ్యంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ (GBT) సీజన్-3 ఘన విజయాన్ని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంతో గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ సీజన్-3కు అధికారికంగా శ్రీకారం చుడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారతను ప్రోత్సహించే ఈ వేదిక మరో విజయవంతమైన అధ్యాయానికి నాంది పలుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!