Health: ఆరోగ్యంగా ఉడడం చాల అవసరం. ఎందుకంటే ఏది కోల్పోయిన సంపాదించుకోగలం. కానీ.. ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించుకోలేం.. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు కొందరు. మరికొందరు ఆరోగ్యంగా ఉండేదుకు సమయం కేటాయించిన ఆరోగ్యాన్ని మాత్రం సంరక్షించుకోలే పోతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండడానికి ఎం చెయ్యాలో ఎప్పుడు తెలుసుకుందాం.
Read also:Holidays: పాఠశాలలకు, కళాశాలలకు రెండు రోజులు సెలవులు.. కారణం ఇదీ..
ప్రస్తుతం అన్ని ఆనారోగ్య సమస్యలకి మూల కారణం అధిక బరువు. అందుకే మొదట బరువుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. బరువు తగ్గాలి అనుకుని చాలా మంది ఆహరం తినడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరంలో నీరు చేరి బరువు పెరుగుతారు. దీని వల్ల ఇంకా లావుగా కనిపించడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే తినడం మానేయకూడదు. తినే ఆ ఆహరం ఆరోగ్యవంతమైనదిగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహరం అంటే మొలకెత్తిన గింజలు, ఎగ్ వైట్, చిరుధాన్యాలు, ఉడకబెట్టిన పప్పులు, వంటి ఆహారం తీసుకోవాలి. అలానే కొవ్వు, చక్కెర స్థాయిలు అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. నీళ్లు ఎక్కువగా తాగాలి, వ్యాయామం చెయ్యాలి. 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఆరోగ్యవంతమైన నిద్ర అధిక బరువుని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలానే ధూమపానం మరియు మద్యపానం బరువుని పెంచుతుంది. అందుకే అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.