NTV Telugu Site icon

Health benefits: చాకెట్లు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

Untitled 24

Untitled 24

Health: ఏదైన శుభవార్త విన్నప్పుడు.. సంతోషం కలిగినప్పుడు చాక్లెట్లు పంచుతూ ఆనందాన్ని పెంచుకుంటాం. అయితే చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాక్లెట్లు ఆనందాన్ని పంచుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల. మరి చాక్లెట్లు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..?

డార్క్ చాక్లెట్‌లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఈ డార్క్ చాక్లెట్లలో కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉంటుంది. సాధారణంగా ఎండిన కకోవా గింజలలో ఏంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని నియంత్రణలో ఉంచి జీవకణాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు దోహదపడతాయి. ఏదైనా అతిగా తింటే అనర్ధాలకి దారితీస్తుది. కానీ మోతాదులో తింటే మాత్రం చాక్లెట్ల వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్లు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆనందం పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ వృద్ధి చెందుతుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. మంచి నిద్ర పడుతుంది. జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది. రోజుకి 28.5 గ్రా. చాక్లెట్ బార్‌ని తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ మనం బజారులో కొనుక్కుని తినే మిఠాయి చాక్లెట్లు వల్ల ఆరోగ్య పరాయోజనాలు ఉండవు. కేవలం డార్క్ చాక్లెట్లు మాత్రమే ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని గమనించగలరు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.