Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthani Khoba Roti Recipe: భారతదేశంలో భిన్న సంస్కృతులతో పాటు.. విభిన్నమైన వంటకాలు ఉంటాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఫుడ్ ఫేమస్‌గా ఉంటుంది.. ప్రాంతాలను బట్టి.. వంటలను తయారు చేసే విధానం మారిపోతోంది.. ఇక, భారతీయ వంటకాలలో రోటీకి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో రోజూ గోధుమ పిండితో చేసిన రోటీలు తయారవుతుంటాయి. అయితే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రుచులతో ఎన్నో రకాల రోటీలు ప్రసిద్ధి చెందాయి. వాటిలో రాజస్థాన్‌కు చెందిన ఖోబా రోటీ ఒకటి. ఈ రోటీ తన ప్రత్యేక ఆకృతి, కరకరలాడే స్వభావం మరియు నెయ్యి రుచితో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. రాజస్థానీ వంటకాలలో ఖోబా రోటీ ఎంతో ప్రసిద్ధి చెందింది. సాధారణ రోటీతో పోలిస్తే ఇది కొంచెం మందంగా ఉంటుంది. ముఖ్యంగా రోటీపై చేసే ప్రత్యేక డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తుంది. ఈ రోటీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
* గోధుమ పిండి – 4 కప్పులు
* సోంపు పొడి – ½ టీస్పూన్
* వాము – ½ టీస్పూన్
* పసుపు పొడి – ¼ టీస్పూన్
* నెయ్యి – ¼ కప్పు (పిండికోసం)
* ఉప్పు – తగినంత
* దేశీ నెయ్యి – కాల్చడానికి మరియు పూరణం కోసం
* నీరు – అవసరమైనంత
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
తయారీ విధానం
– ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో సోంపు పొడి, వాము, పసుపు పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత నెయ్యి వేసి చేతులతో పిండిలో బాగా కలిసేలా చేయాలి.
– ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా, మృదువుగా ఉండేలా పిండిని కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. పిండి సిద్ధమైన తర్వాత దానిని 10 నుంచి 15 నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టాలి.
– తర్వాత పిండిలోంచి ఒక పెద్ద ఉండ తీసుకుని అర అంగుళం మందంతో రోటీలా ఒత్తాలి. రోటీని ఒత్తిన తర్వాత ఫోర్క్ లేదా కత్తితో చిన్న చిన్న గుచ్చులు పెట్టాలి. దీనివల్ల రోటీ బాగా ఉడికి కరకరలాడుతుంది.
– ఇప్పుడు పెనంపై కొద్దిగా నెయ్యి రాసి రోటీని వేయాలి. ఒక వైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపు తిప్పాలి. ఆ తర్వాత వేళ్లతో లేదా పట్టుకారుతో రోటీపై చిన్న చిన్న గుంతలు చేస్తూ సాంప్రదాయ ఖోబా డిజైన్ రూపొందించాలి. ఈ డిజైన్ వల్ల నెయ్యి రోటీలో బాగా ఇంకి రుచి మరింత పెరుగుతుంది.
– తక్కువ మంటపై రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకు కాల్చాలి. కావాలంటే చివరగా నేరుగా మంటపై కొద్దిగా కాల్చి మరింత సాంప్రదాయ రుచి తీసుకురావచ్చు.
ఏ వంటకాలతో తింటే బాగుంటుంది?
వేడి వేడి ఖోబా రోటీపై దేశీ నెయ్యి పోసి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని పంచ్మెల్ దాల్, గట్టే కీ సబ్జీ, వెల్లుల్లి చట్నీ లేదా బెల్లంతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ప్రత్యేక రాజస్థానీ వంటకాన్ని ఇష్టపడతారు.. ఇంకేముందు.. రెగ్యులర్‌గా రోటీ తింటూ బోర్‌గా ఫీల్ అయ్యేవారికి ఈ ప్రత్యేక వంటకం.. ఎంతగానో నచ్చే అవకాశం లేకపోలేదు.. ఓసారి మారి ట్రైచేయండి మరి..
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!