Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
- సత్తు డ్రింక్‌కు కావాల్సిన పదార్థాలు
- బాదం – సత్తు పొడి తయారీ చిట్కా
- ఐదు నిమిషాల్లో ప్రోటీన్ షేక్ రెడీ
- ఈ డ్రింక్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protein Rich Sattu Drink : వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంచడానికి సత్తు డ్రింక్ (Sattu Drink) ఒక అద్భుతమైన హెల్తీ ఆప్షన్. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సాంప్రదాయ పానీయం ప్రస్తుతం హెల్త్ కాన్షస్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. కేవలం తక్కువ సమయంలో, ఇంట్లోనే లభించే పోషక పదార్ధాలతో ఎంతో రుచికరమైన, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సత్తు షేక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- సత్తు లేదా వేయించిన శనగపిండి: అర కప్పు
- బాదం పప్పులు: 20
- పండిన అరటిపండు: 1
- ఖర్జూరాలు (గింజలు తీసేసినవి): 4
- కాచి చల్లార్చిన పాలు: రెండున్నర కప్పులు
- గార్నిషింగ్ కోసం: సన్నగా తరిగిన పిస్తా, బాదం ముక్కలు
తయారీ విధానం:
బాదం , సత్తు పొడి సిద్ధం చేయడం
ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా 20 బాదం పప్పులను నీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిపై ఉన్న పొట్టును పూర్తిగా తొలగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన శనగలు (సత్తు పిండి) , పొట్టు తీసిన బాదం పప్పులను వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
చిన్న చిట్కా: ఈ సత్తు-బాదం పొడిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని, గాలి చొరబడని ఒక పొడి డబ్బాలో (Air-tight Container) నిల్వ చేసుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో ఈ హెల్తీ డ్రింక్ తయారు చేసుకోవచ్చు.
బ్లెండింగ్ ప్రక్రియ
పొడి సిద్ధమైన తర్వాత ఒక పెద్ద బ్లెండర్, జ్యూస్ జార్ తీసుకుని.. అందులో సన్నగా తరిగిన అరటిపండు ముక్కలు, గింజలు తీసేసిన ఖర్జూర పండ్లు, , మనం ముందుగా సిద్ధం చేసుకున్న సత్తు-బాదం పొడిని వేయాలి. దీనికి మొదట ఒకటిన్నర కప్పుల పాలు పోసి మిక్సీని బాగా బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమం కాస్త చిక్కగా మారిన తర్వాత, డ్రింక్ సరైన స్థిరత్వానికి (కన్సిస్టెన్సీ) రావడానికి మిగిలిన ఒక కప్పు పాలు కూడా పోసి మరోసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
సర్వింగ్ , గార్నిషింగ్
అంతే.. ఎంతో రుచికరమైన ప్రోటీన్ రిచ్ సత్తు డ్రింక్ రెడీ అయిపోయినట్లే. దీన్ని ఒక సర్వింగ్ గ్లాసులోకి తీసుకుని, పైన మరికొన్ని అరటిపండు ముక్కలు, సన్నగా తరిగిన పిస్తా , బాదం పప్పులతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్రోటీన్ లభించడమే కాకుండా, ఎండల తీవ్రతకు నీరసించిపోయే శరీరానికి తక్షణ శక్తి (Instant Energy) అందుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, జిమ్‌కు వెళ్లేవారు దీనిని తమ డైలీ బ్రేక్‌ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్ లాగా హ్యాపీగా తీసుకోవచ్చు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!