NTV Telugu Site icon

Banana: చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?

Banana At Night Time

Banana At Night Time

అరటిపండు అన్ని సీజన్లలో లభిస్తుంది. అరటిపండు తింటే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు అద్భుతంగా పని చేస్తుంది. అరటి పండును తరచుగా ఉదయం, సాయంత్రం అల్పాహారంగా తింటుంటారు. శరీరంలో వేడి ఉంటే అరటిపండు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా.. తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. కడుపు మంట, విపరీతమైన వేడి ఉన్నవారు అరటిపండు తినకుండా ఉండటం బెటర్. చలికాలంలో అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిది. జలుబు ఉన్నవారు అరటిపండు తినొద్దు.

అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. విటమిన్ ఎ, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అరటి పండు తినడం వల్ల గుండె నుండి జీర్ణక్రియ వరకు ప్రతిదీ ఆరోగ్యంగా ఉంచుతుంది. చలి కాలంలో ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉండే అరటిపండును తీంటే.. ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అరటిపండులో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లావిన్, B6 వంటి అవసరమైన విటమిన్లు.. ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి . చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

Bhairathi Ranagal: త్వరలో తెలుగులో కన్నడ థ్రిల్లర్ “భైరతి రణగల్”

మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:
అరటిపండులో కరిగే, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్ జీర్ణక్రియను మందగించే ధోరణిని కలిగి ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అరటిపండు తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా.. మలబద్ధకం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తుంది. కాబట్టి.. రాత్రి పూట తినొద్దు.

చలికాలంలో అరటిపండు తినాలా వద్దా..?
అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది.. బలాన్ని ఇస్తుంది. అయితే చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి. మీకు దగ్గు, జలుబు లేదా ఏదైనా శ్వాసకోశ సమస్యలు ఉంటే.. రాత్రిపూట అరటిపండు తినవద్దు. దీన్ని తినడం వల్ల శ్లేష్మం లేదా కఫం వంటి సమస్యలు వస్తాయి.

Show comments