అరటిపండు పేరు చెబితే అది తినకూడదు.. తింటే పొట్ట పెరుగుతుందంటారు. అందరికీ అందుబాటులో ఉండే అరటిపండ్లు అన్నీ సీజన్లలో దొరుకుతుంటాయి. చిన్నపిల్లల దగ్గర్నించి ప్రతి ఒక్కరూ కూడా వీటిని తింటారు. ఎంత ఆరోగ్యకరమైన పండో.. ఈ పండు చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి. కొన్ని పరిశోధనలు ఇది మంచి ఆరోగ్యకరమైన పండు అని చెప్పగా.. మరికొన్ని ఇది అనేక సమస్యలు తెస్తుందని, కొంతమంది రోగులు వీటిని తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. నిజానికి ఎన్నో పోషకాలు, మినరల్స్, ఇతర విటమిన్స్ నిండి ఉన్న ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు పోషకాహార నిపుణులు. నిజానికి భారతదేశంలో 50 రకాలు పైగా అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం.
వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని అంటారు. ముఖ్యంగా జీర్ణసంబంధ సమస్యలను అరటిపండ్లు దూరం చేస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారు అరటిపండు తినడం మంచిది. అందుకే డాక్టర్స్ కూడా ఈ పండుని తినడం చాలా మంచిదని అంటారు. అరటిపండ్లు తక్కువ నుండి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు. ఈ విషయాన్ని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. అరటిపండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుందనేది అపోహ మాత్రమే. అరటిపండులో ఫ్రక్టోజ్, విటమిన్ బి వుంటుంది. అరటిపండ్లలో సహజ చక్కెర ఉంటుంది. అంతేకాకుండా అరటిపండ్లు తింటే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందని భావిస్తారు. కానీ మాత్రం నిజం కాదు.
Read Also: Amaravati: అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం..
అరటిపండ్లలో ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో బ్లోటింగ్ సమస్య తగ్గించి మంచి బ్యాక్టీరియాను డెవలప్ చేస్తాయి. అరటిపండ్లలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, కొవ్వును కరిగించడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అరటిపండ్లలో విటమిన్ బి6, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అప్పటికప్పుడు శక్తి వస్తుంది. బీపీ ఉన్నవారు మధ్యాహ్నం తినడానికి అరటిపండ్లు చాలా మంచివని చెప్పొచ్చు. అరటిపండ్లు సహజంగాఎలక్ట్రోలైట్స్‌లో అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి హాని చేయవు. బీపీతో బాధపడేవారు పరిమితంగా అరటిపండ్లు తినవచ్చు.
భోజనం తరువాత అరటి పండు తినడం ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. పెళ్లి భోజనాలలో అరటి పండు ఖచ్చితంగా ఉండాల్సిందే. విరేచనాలు, రక్తహీనత, క్షయవ్యాధి, ఆర్థరైటిస్, గౌట్, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటి పండు కాపాడుతుంది. అరటిని తినడం వలన కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి. బలమైన ఎముకలను నిర్మించడం వల్ల శరీర పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి మంచిది.అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది. పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటాసిడ్‌ల ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుందని తేలింది.
Read Also: Ishant Sharma: షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..ఇషాంత్ ఏమన్నాడంటే!