Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
- గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ
- మెంతి ఆకులు, శనగపిండి కాంబోతో అదిరే రుచి
- బయట క్రంచీ.. లోపల సాఫ్ట్ టెక్స్చర్ సీక్రెట్ ఇదే
- టీ టైమ్‌లో ట్రై చేయాల్సిన పర్ఫెక్ట్ స్నాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా గుజరాతీ ‘మేథీ నా గోటా’.. మెంతి ఆకులతో క్రిస్పీ పకోడీ రెసిపీ!
సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది పకోడీలు లేదా బజ్జీలు. అయితే ఎప్పుడూ ఒకేలాంటి ఉల్లిపాయ పకోడీ కాకుండా ఈసారి గుజరాత్ స్పెషల్ ‘మేథీ నా గోటా’ (Methi na Gota) ట్రై చేయండి. తాజా మెంతి ఆకులు, శనగపిండి కాంబినేషన్లో తయారయ్యే ఈ వంటకం పైన క్రిస్పీగా, లోపల ఎంతో సాఫ్ట్‌గా ఉంటుంది. మెంతి ఆకుల్లో ఉండే లైట్ చేదుదనం, మసాలాల ఘాటు, కొద్దిగా తీపి కలిసి ఈ గోటాలకు అద్భుతమైన టేస్ట్‌ని ఇస్తాయి. టీ టైమ్ లో తింటూ ఎంజాయ్ చేయడానికి ఎంతో పర్ఫెక్ట్గా ఉండే ఈ గుజరాతీ స్ట్రీట్ స్టైల్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Dinner Foods: ఆరోగ్యకరమైనవే.. అయినా రాత్రిపూట ఇవి తినొద్దు.. వైద్యుల హెచ్చరిక..
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
కావలసిన పదార్థాలు:
- శనగపిండి (Besan): 2 కప్పులు
- తాజా మెంతి ఆకులు , కొత్తిమీర ఆకులు: ఒక చిన్న కప్పు (సన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
- మసాలా దినుసులు: ఉప్పు (1 టీస్పూన్), మిరియాల పొడి (1 టీస్పూన్), దంచిన ధనియాలు (1 టీస్పూన్), వాము (1 టీస్పూన్), ఇంగువ (చిటికెడు)
- సీక్రెట్ ఇంగ్రిడియెంట్స్: సూజీ రవ్వ (1 టీస్పూన్), చక్కెర (1 టీస్పూన్)
- వంట సోడా (బేకింగ్ సోడా): చిటికెడు
- నిమ్మరసం: కొన్ని చుక్కలు
- నీరు: తగినంత
- నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం చాలా ఈజీ:
డ్రై పౌడర్ మిశ్రమాన్ని కలపడం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఉప్పు, మిరియాల పొడి, దంచిన ధనియాలు, వాము, , చిటికెడు ఇంగువ యాడ్ చేయాలి. వీటితో పాటు ఒక చెంచా సూజీ రవ్వ (ఇది గోటాలు క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుంది), అలాగే ఒక చెంచా చక్కెర వేసి స్పూన్‌తో డ్రై పౌడర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
మెంతి ఆకులు , బ్యాటర్ ప్రిపరేషన్
ఇలా రెడీ చేసుకున్న పొడి పిండి మిశ్రమంలో మనం ముందుగా క్లీన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న తాజా మెంతి ఆకులు, కొత్తిమీర ఆకులు, , పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా చేత్తో పకోడీల్లా వేయడానికి వీలుగా ఉండే ‘జారుడు పద్ధతి’ (Dropping Consistency) లో కలుపుకోవాలి. చివరగా ఇందులో చిటికెడు వంట సోడా, దానిపై కొన్ని చుక్కల నిమ్మరసం పిండితే సోడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు బ్యాటర్‌ని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించడం
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్‌ను మీడియం-హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న రౌండ్ ఉండల్లా (గోటాల్లా) నూనెలో జాగ్రత్తగా వదలాలి. ఇవి నూనెలో వేసిన వెంటనే పైకి తేలుతాయి. వీటిని గరిటెతో అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా సమానంగా వేగేలా చూసుకోవాలి.
ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి పైన క్రిస్పీగా తయారవ్వగానే నూనెలో నుండి జల్లెడ గరిటెతో తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి మార్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి గుజరాతీ ‘మేథీ నా గోటా’ రెడీ. వీటిని కారంగా ఉండే పుదీనా-కొత్తిమీర చట్నీతో లేదా టమోటో కెచప్‌తో తింటే ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే!
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!