Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palak Pakoda Recipe: ఎండులు ఇంకా దంచికొడుతూనే ఉన్నాయి.. ఇక, త్వరలోనే రెయిన్ సీజన్ ప్రారంభం కాబోతోంది.. వర్షాకాలంలో లేదా సాయంత్రం టీ సమయానికి వేడివేడి పకోడాలు తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. సాధారణంగా ఉల్లిపాయ, ఆలూ లేదా మిర్చి పకోడాలు ఎక్కువగా చేస్తుంటారు. అయితే, కరకరలాడే పాలకూర పకోడాల రుచి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందించే ఈ పకోడాలు ఇంట్లో చాలా తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండగా, శనగపిండి ప్రోటీన్లను అందిస్తుంది. ఈ రెండింటి కలయికతో తయారయ్యే పాలక్ పకోడాలు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాహారంగా కూడా ఉంటాయి. త్వరగా తయారయ్యే సాయంత్రపు స్నాక్ కోసం ఇది అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు..
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
కావలసిన పదార్థాలు
* 2 కప్పుల పాలకూర (బాగా కడిగి సన్నగా తరిగినది)
* 1 కప్పు శనగపిండి
* 2 టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి
* 1/4 టీస్పూన్ పసుపు
* 1 టీస్పూన్ అల్లం-కారం పేస్ట్
* 1/2 టీస్పూన్ వాము
* 1 టీస్పూన్ చాట్ మసాలా
* 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా
* తగినంత ఉప్పు
* వేయించడానికి నూనె
తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద గిన్నెలో తరిగిన పాలకూరను తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. తర్వాత పసుపు, వాము, అల్లం-కారం పేస్ట్, చాట్ మసాలా, బేకింగ్ సోడా, ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ చిక్కటి పిండిమిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా, పాలకూరకు బాగా పట్టేలా ఉండాలి. దీంతో పకోడాలు కరకరలాడుతూ వస్తాయి. తర్వాత ఒక బాణలిలో నూనె వేడి చేయాలి. నూనె సరిపడా వేడెక్కిన తర్వాత పిండిమిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని నెమ్మదిగా నూనెలో వేయాలి. మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన పకోడాలను టిష్యూ పేపర్‌పై తీసి అదనపు నూనె తొలగించాలి. అనంతరం వేడివేడి పాలక్ పకోడాలను పచ్చి చట్నీ, టమాటో సాస్ లేదా ఒక కప్పు వేడి టీతో వడ్డించాలి. కరకరలాడే టెక్స్చర్, అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో పాలకూర పకోడాలు కుటుంబ సభ్యులందరికీ నచ్చే సాయంత్రపు చిరుతిండిగా నిలుస్తాయి.
తాజావార్తలు
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!