Site icon NTV Telugu

Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

Chicken Samosa

Chicken Samosa

Chicken Samosa: అలా చల్లని సాయంత్రం వేళ.. చిరు జల్లులు పడుతుంటే, కప్పు కాఫీతో పాటు కరకరలాడే వేడి వేడి సమోసా తింటుంటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం బయట బండి మీద దొరికే ఆలు సమోసాలను తింటూ ఉంటాం. కానీ, అదే బండి మీద దొరికే రుచితో, అంతకంటే నాణ్యంగా.. నోరూరించే ‘చికెన్ సమోసా’లను ఇంట్లోనే తయారు చేసుకుంటే? నాన్-వెజ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా, అదిరిపోయే రుచితో క్రిస్పీ చికెన్ సమోసాను ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: GT vs MI: సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

తయారీ విధానం:
ఈ క్రిస్పీ చికెన్ సమోసా తయారీకి ముందుగా చికెన్ కీమాను సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అందులో చికెన్ కీమా వేసి, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి చికెన్ లోని నీరంతా పోయే వరకు బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే సమోసా స్టఫింగ్ సిద్ధమవుతుంది. తర్వాత మైదా పిండితో చేసిన షీట్లను తీసుకుని, కోన్ ఆకారంలో మడతపెట్టాలి. మైదా పిండి మిశ్రమంతో అంచులను అతికిస్తూ, మధ్యలో చికెన్ స్టఫింగ్ ని నింపాలి. అనంతరం సిద్ధం చేసుకున్న సమోసాలను మీడియం ఫ్లేమ్ మీద నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ సమోసా రెడీ.

బయట దొరికే సమోసాల కంటే ఇంట్లో చేసుకునే ఈ చికెన్ సమోసాలు ఎంతో తాజాగా, క్రిస్పీగా ఉంటాయి. వీటికి కాంబినేషన్ గా వేయించిన పచ్చిమిర్చి తీసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. కేవలం కొద్దిపాటి సమయంలోనే ఈ రెస్టారెంట్ స్టైల్ స్నాక్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా కుదిరినప్పుడు ప్రయత్నించండి.

READ ALSO: Justice Swarana Kanta Sharma: మాజీ సీఎంకు హైకోర్టు గట్టి షాక్.. ‘కేజ్రీవాల్ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు’

Exit mobile version