GT vs MI: సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్ కు దిగింది. తిలక్ వర్మ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సులు, ఫోర్లతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. సెంచరీతో చెలరేగిన తిలక్ ముంబైకి భారీ స్కోర్ అందించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. గుజరాత్ కు 200 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభం పేలవంగా ఉంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన క్వింటన్ డి కాక్ 13 పరుగులకే ఔటయ్యాడు. అరంగేట్రం చేసిన డానిష్ కూడా కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమై, కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, తిలక్ వర్మ, నమన్ ధీర్ అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 13వ ఓవర్‌లో నమన్ ధీర్ 45 పరుగుల వద్ద ఔటవడంతో ముంబైకి నాలుగో దెబ్బ తగిలింది. నమన్ తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఆ తర్వాత తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. గాయమైనప్పటికీ, తిలక్ ఆటను కొనసాగించి, కేవలం 45 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. 20వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. తిలక్ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాధాడు. తిలక్ వర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని కేవలం 45 బంతుల్లోనే సాధించాడు. అతను చేసిన అజేయ 101 పరుగులే ఈ లీగ్‌లో అతని అత్యుత్తమ స్కోరు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!