Site icon NTV Telugu

Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

Bendi

Bendi

Health Tips in Telugu : బెండకాయలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, కొన్ని రకాల కూరగాయలతో బెండకాయను కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం:

Chiranjeevi : తమిళ డైరెక్టర్ కథకు బాస్ ఫిదా..బిగ్గెస్ట్ కాంబో లోడింగ్?

1. బంగాళదుంప (Potato):
బెండకాయ , బంగాళదుంపలను కలిపి తీసుకోకూడదు. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటే, బంగాళదుంపలో పిండి పదార్థాలు (Carbohydrates) అధికంగా ఉంటాయి. ఇవి రెండూ కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయిల అస్థిరత ఏర్పడటంతో పాటు ఊబకాయానికి దారితీయవచ్చు.

2. వంకాయ (Brinjal):
వంకాయలో ఐరన్ గ్రహించడాన్ని తగ్గించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. బెండకాయ జిగురు స్వభావం కలిగి ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది , చర్మ అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

3. ముల్లంగి (Radish):
ముల్లంగిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కడుపులో గ్యాస్‌ను పెంచుతాయి. బెండకాయ, ముల్లంగి రెండూ భిన్నమైన స్వభావం కలిగినవి. వీటిని కలిపి తినడం వల్ల గ్యాస్, అసిడిటీ , చర్మ సంబంధిత సమస్యలు (Skin Allergies) తలెత్తవచ్చు.

4. కాకరకాయ (Bitter Gourd):
కాకరకాయ , బెండకాయలను కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అసిడిటీ, కడుపులో మంట, డీహైడ్రేషన్ , తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలు ఉంటే ఈ రెండింటిని కలిపి అస్సలు తినకండి.

కూరగాయలే కాకుండా, బెండకాయ తిన్న వెంటనే పాలు, పెరుగు, టీ లేదా ఎర్ర మాంసం (Red Meat) తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఈ కథనం పేర్కొంది.

EVs Over 600KM Range: లాంగ్ డ్రైవ్‌లకు పర్ఫెక్ట్.. భారత్‌లో 600KM+ రేంజ్ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ SUVలు..

Exit mobile version