NTV Telugu Site icon

Carrot Recipes: మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? క్యారెట్‌తో ఇలా తయారు చేసి పెట్టండి

Carrot

Carrot

చలికాలంలో మీ పిల్లలు ఆహారం తినడం లేదా..? ఒక పక్క సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ.. ఆహారం తినడానికి ఇష్టపడరు. చలికాలంలో జలుగు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సమయంలో పిల్లలకు క్యారెట్‌తో తయారు చేసిన వంటకం ఆరోగ్య పరంగా మంచిది. ఇది రుచితో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో పిల్లలకు క్యారెట్‌తో ఎలాంటి ఆహారాలు తయారు చేసి పెట్టాలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీలోని నాలుగు పంచాయతీలకు అవార్డులు.. అభినందించిన పవన్ కల్యాణ్

క్యారెట్ పరాటా:
క్యారెట్ పరాటా ఆరోగ్యకరమైన అల్పాహారం. చలికాలంలో ఉదయాన్నే పిల్లలతో పాటు పెద్దలు తింటే ఆరోగ్యానికి మంచిది. క్యారెట్ పరాటాలో పన్నీర్ లేదా ఉడికించిన బంగాళదుంపలతో తయారు చేస్తారు. క్యారెట్ పరాటా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పెరుగు లేదా చట్నీతో తినవచ్చు.

క్యారెట్ ఖీర్:
చలికాలంలో తీపి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని అనుకుంటే.. క్యారెట్‌తో తయారు చేసిన ఖీర్‌ బెస్ట్. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాహారంతో కూడుకున్న ఆహారం. దీనిని క్యారెట్, పాలు, చక్కెర, నెయ్యి, మావా, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. ఇందులో కుంకుమపువ్వు కూడా వేస్తారు. క్యారెట్ ఖీర్ ఎక్కువగా పిల్లలు తినడానికి ఇష్టపడతారు.

క్యారెట్ కూర:
రోజూ క్యాబేజీ, బఠానీలతో తయారు చేసిన కర్రీస్ తిని బోర్ కొడితే చలికాలంలో క్యారెట్ వెజిటేబుల్ ట్రై చేయండి. ఇది తేలికపాటి, ఆరోగ్యకరమైన వంటకం. దీన్ని బంగాళదుంపలతో కలిపి తయారు చేసుకోవచ్చు. క్యారెట్ కూరను రోటీ, పరాటా లేదా పూరీలో తినవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది.

క్యారెట్‌తో చేసిన స్వీట్:
క్యారెట్ హల్వా అంటే అందరికీ ఇష్టమే. వింటర్ సీజన్‌లో వేడి వేడి క్యారెట్ హల్వా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ హల్వా.. తురిమిన క్యారెట్లు, పాలు, నెయ్యి, మావా, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.

క్యారెట్ పులావ్:
చలికాలంలో క్యారెట్ పులావ్ తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. క్యారెట్, బఠానీ పులావ్ తినడానికి రుచికరమైనది మాత్రమే కాదు.. పోషకాహారాన్ని కూడా కలిగి ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యారెట్ పులావ్ పిల్లలకు తినిపిస్తే ఆరోగ్యానికి మంచిది.

Show comments