NTV Telugu Site icon

Health Benefits: ఈ జ్యూస్ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా

Aloe Vera

Aloe Vera

కలబంద వాడకం చర్మానికి ప్రయోజనకరంగా చెబుతారు. కలబంద మన ఇంటి పరిసరాల్లో దొరుకుతుంది. కలబంద వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నయం చేసే గుణం దీనిలో ఉంది. కలబంద ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పని చేస్తుంది. అలోవెరా నుంచి వచ్చే జెల్, జ్యూస్ రెండూ ప్రయోజనకరంగా ఉపయోగ పడుతాయి.

అలోవెరాలో దాదాపు 250 రకాల జాతులు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో 4 రకాలను మాత్రమే చర్మ సంరక్షణకు, డ్రింకింగ్‌కు ఉపయోగిస్తున్నారని అంటున్నారు. కలబందలో విటమిన్లు ఎ, సి, ఈ.. అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా.. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలోవెరాలో పాలీఫెనాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.

Manipur Violence: ఆరుగురి హత్యతో మణిపూర్‌లో హింస.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..

కలబంద ప్రయోజనాలు:
అలోవెరా జెల్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కలబందను ఎక్కువగా చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తారు. అయితే దీనిలో అనేక గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా పరిగణిస్తారు.

ఎముకలకు మేలు చేస్తుంది:
అలోవెరా జెల్ ఎముకలకు మేలు చేస్తుంది. అలోవెరా జెల్‌లో ఎసిమన్నన్ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ పరిశోధనా అధ్యయనం ప్రకారం.. అలోవెరా జెల్ లోపల ఉండే ఎసిమన్నన్ ఎముకల నిర్మాణానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో.. గాయాలు త్వరగా నయం అవుతాయి.

గుండెల్లో మంటకు ప్రభావవంతం:
గుండెల్లో మంట సమస్యకు కలబందను ఉపయోగించవచ్చు. అలోవెరా యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జెల్ తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ, జీర్ణక్రియకు మంచిది:
కలబందలో పాలీశాకరైడ్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ పాలీశాకరైడ్‌లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అలోవెరా జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. ఇవి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలకు మేలు చేస్తాయి.

బరువు తగ్గడం కోసం:
కలబందలో అధిక మొత్తంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Show comments