Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Roti to Ragi Roti: ఆరోగ్యంపై కొంత అవగాహన పెరుగుతుంది.. రైస్ ప్లేస్‌లో క్రమంగా చపాతి, రొట్టెలు, ఫైబర్ ఫుడ్, విటమిన్ ఫుడ్ ఇలా.. కొత్తగా ఆలోచిస్తున్నారు.. ఇలా మన రోజువారీ ఆహారంలో రొట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.. సాధారణంగా చాలామంది గోధుమ పిండితో చేసిన రొట్టెలనే తీసుకుంటారు. అయితే ఒకే రకమైన ధాన్యంపై ఆధారపడకుండా వివిధ రకాల ధాన్యాలు, మిల్లెట్లతో చేసిన రొట్టెలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల భోజనంలో వైవిధ్యం పెరుగుతుంది. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి.
బార్లీ రొట్టె
బార్లీకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిలపై శ్రద్ధ వహించే వారికి ఇది ఒక ఎంపికగా ఉండొచ్చు. బరువు నియంత్రణ కోరుకునేవారికి కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే బార్లీలో గ్లూటెన్ ఉంటుంది. కాబట్టి సెలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ అసహనం ఉన్నవారు దీనిని దూరంగా ఉండాలి..
Also Read
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
జొన్న రొట్టె
జొన్న సహజంగా గ్లూటెన్ రహిత ధాన్యం. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేందుకు సహాయపడుతుంది. అయితే జీర్ణ సమస్యలు లేదా IBS ఉన్నవారు తమకు సరిపోయే పరిమాణంలోనే తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు..
రాగి రొట్టె
రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం అందించే మంచి ఆహారంగా రాగిని పరిగణిస్తారు. అయితే కిడ్నీ సమస్యలు లేదా ఇతర ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు ఆహారంలో ఎక్కువగా చేర్చే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం..
మొక్కజొన్న రొట్టె
మొక్కజొన్నతో తయారుచేసే రొట్టెలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ A వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా ఉపయోగపడతాయి. అయితే మధుమేహం ఉన్నవారు రొట్టె పరిమాణాన్ని, మొత్తం కార్బోహైడ్రేట్ తీసుకునే స్థాయిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది..
మిల్లెట్ రొట్టె
మిల్లెట్లు ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలకు మంచి వనరులు. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల భోజనంలో ధాన్యాల వైవిధ్యం పెరుగుతుంది. ఫైబర్ కారణంగా జీర్ణక్రియకు కూడా తోడ్పడవచ్చు. థైరాయిడ్ వంటి ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యక్తిగత ఆహార అవసరాలకు అనుగుణంగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు..
రాజగిర రొట్టె
రాజగిరలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది గ్లూటెన్ రహిత ధాన్యం కావడంతో గ్లూటెన్ను నివారించేవారికి ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఉపవాస సమయంలో కూడా రాజగిరతో చేసిన ఆహారాన్ని చాలామంది తీసుకుంటారు. అయితే అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
గోధుమ రొట్టెను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు
ఆరోగ్యంగా ఉండాలంటే గోధుమ రొట్టెను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మీ ఆహారంలో జొన్న, రాగి, బార్లీ, మొక్కజొన్న, మిల్లెట్లు, రాజగిర వంటి వివిధ ధాన్యాలతో చేసిన రొట్టెలను మారుస్తూ చేర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆహారంలో వైవిధ్యం పెరగడంతో పాటు వివిధ పోషకాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఆహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
ట్రెండింగ్
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!