High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Protein Breakfast: ఉదయాన్నే లేవగానే వేడివేడిగా, కమ్మటి వాసనతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ ముందుంటే ఆ రోజంతా ఎంత హుషారుగా గడిచిపోతుందో మనలో చాలా మంది ఎప్పుడో అప్పుడు అనుభవించే ఉంటారు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో, వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మినపట్టు తింటుంటే ఆ మజానే వేరు. పూర్వం మన పెద్దలు శరీరం ఉక్కులా బలంగా ఉండటానికి రోజూ ఉదయాన్నే మినపప్పుతో చేసిన వంటకాలను టిఫిన్ కింద పెట్టేవారు. మరి హోటల్ స్టైల్లో దూదిలాంటి స్పాంజ్ మినపట్లు, వాటికి జోడిగా నోరూరించే రోటి పచ్చళ్లు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో.. ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
గుల్లగా, స్పాంజ్ లాంటి ‘మినపట్టు’ రహస్యం
మినపట్టు హోటల్ స్టైల్లో దూదిలా, గుల్లగా రావాలంటే పిండిని సరైన కొలతలతో రుబ్బి, ముందు రోజు రాత్రే పులియబెట్టాలి. ఒక గ్లాసు మినపప్పుకు మూడు గ్లాసుల రవ్వ వేయాలి. ఈ కొలతతోనే అట్టు స్పాంజ్ లాగా వస్తుంది.
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
తయారీ విధానం:
పిండి మరీ లూజ్‌గా కాకుండా, గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. పెనం బాగా వేడెక్కాక చిన్న చిన్న అట్లు వేసి, మూత పెట్టి సిమ్‌లో నిదానంగా కాల్చుకుంటే కమ్మని మినపట్టు రెడీ అవుతుంది. దీనిపై కొద్దిగా జీలకర్ర వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.
హోటల్ స్టైల్ ‘పచ్చి కొబ్బరి పచ్చడి’
నూనెలో వేయించే పని లేకుండా రోట్లో దంచే కమ్మని కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోస, అట్లలోకి అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు: ఒక కొబ్బరికాయ తురుము, రెండు గుప్పెళ్ల వేపుడు శెనగపప్పు (పుట్నాలు), ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి రెమ్మలు, నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు.
తయారీ విధానం:
రోట్లో మొదట కొబ్బరి తురుము, పుట్నాలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బాలి. చివర్లో చింతపండు వేసి మెత్తగా నూరి బౌల్లోకి తీసుకోవాలి. దీనికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని, కొద్దిగా నీరు కలిపి లూజ్‌గా చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి రోటీ పచ్చడి రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు
మినపప్పులో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, కండరాలను బలోపేతం చేస్తాయి. అందుకే పూర్వం పెద్దలు శరీరం ఉక్కులా మారడానికి మినప వంటకాలను సిఫార్సు చేసేవారు. మినపప్పు శరీరంలో వాపులను తగ్గించడానికి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎంతో సహాయపడుతుంది. మినపట్టు పిండిని ముందు రోజు రాత్రే పులియబెట్టడం వల్ల అందులో మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యానికి ఎంతో మంచిది, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఈజీగా జీర్ణమవుతుంది. అలాగే అట్టుపై, పచ్చడిలో వాడే జీలకర్ర జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు శరీరానికి నిదానంగా, స్థిరంగా శక్తిని అందిస్తాయి. ఉదయాన్నే ఈ టిఫిన్ తినడం వల్ల నీరసం రాకుండా రోజంతా హుషారుగా ఉండవచ్చు. పచ్చి కొబ్బరి పచ్చడిలో ‘లారిక్ యాసిడ్’ ఉంటుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పచ్చి కొబ్బరిని నూనెలో వేయించకుండా నేరుగా రోట్లో దంచి చేయడం వల్ల అందులోని సహజసిద్ధమైన పోషకాలు నశించకుండా శరీరానికి అందుతాయి. మినపప్పులో ఐరన్ (ఇనుము) కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అలాగే పచ్చడిలో ఉపయోగించే పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండులలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..