Running Time by Age: మీరు ఫిట్‌గానే ఉన్నారా? ఏ వయసు వారు ఎన్ని నిమిషాలు ఆగకుండా పరుగెత్తాలంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Running Time by Age: ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది బయటకు ఫిట్‌గా కనిపించినా, లోపల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం అంత సులభం కాదు. నిజానికి, ఫిట్నెస్ అంటే కేవలం జిమ్‌లో బరువులు ఎత్తడం కాదు.. మీ గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీర ఓపిక అన్నీ కలిసి పనిచేసే స్థితి. ఈ నేపథ్యంలో, మీరు నిరంతరాయంగా ఎంతసేపు పరుగెత్తగలుగుతున్నారనే విషయం మీ ఫిట్‌నెస్‌కు ముఖ్యమైన సూచికగా భావించవచ్చు.
పరుగు ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. కానీ కొద్దిసేపే పరిగెత్తిన తర్వాతే అలసిపోతే, అది మీ శరీర సామర్థ్యం తగ్గుతున్న సంకేతం కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వయస్సు ఆధారంగా ప్రతి వ్యక్తి కొంతసేపు ఆగకుండా పరుగెత్తగలగాలి. ఆ స్థాయికి చేరుకోలేకపోతే, మీ గుండె ఆరోగ్యం, ఊపిరితిత్తుల పనితీరు మరియు మొత్తం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Also Read
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
ఏ వయసులో ఎంతసేపు పరుగెత్తాలి?
* 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు కనీసం 25 నుంచి 30 నిమిషాల పాటు నిరంతరాయంగా పరుగెత్తగలగాలి.
* 30 నుంచి 40 సంవత్సరాల వయస్సులో 20 నుంచి 25 నిమిషాలు పరుగెత్తడం సాధారణంగా సరిపోతుంది.
* 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వారు 15 నుంచి 20 నిమిషాల పాటు పరుగెత్తగలగడం మంచి ఫిట్నెస్గా పరిగణిస్తారు.
* 50 సంవత్సరాల పైబడినవారు నడక-జాగింగ్ మిళితంగా 10 నుంచి 15 నిమిషాలు కొనసాగించగలిగితే అది ఆరోగ్యకరమైన స్థాయి.
ఈ సమయాల కంటే ముందే అలసిపోతే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే, అది మీ శారీరక సామర్థ్యం తగ్గుతోందని సూచన.
పరుగెత్తే ఓపిక ఎందుకు తగ్గుతుంది?
పరుగులో ఓపిక తగ్గడానికి ప్రధాన కారణాలు జీవనశైలి మరియు అలవాట్లలోనే ఉన్నాయి. క్రమం తప్పని వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనపడుతుంది. వయస్సు పెరిగేకొద్దీ కండరాల బలం, ఊపిరితిత్తుల సామర్థ్యం, గుండె పనితీరు తగ్గడం సహజం. అలాగే, ఎక్కువసేపు కూర్చోవడం, నిద్రలేమి, ధూమపానం, అధిక ఒత్తిడి వంటి అంశాలు కూడా శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేసి, త్వరగా అలసటకు దారితీస్తాయి.
ఫిట్నెస్ను ఎలా మెరుగుపరుచుకోవాలి?
మీరు పై చెప్పిన ప్రమాణాలకు చేరుకోలేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రమంగా ప్రయత్నిస్తే మీ ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవచ్చు. ప్రారంభంలో వేగంగా నడవడం మొదలుపెట్టి, తరువాత నడకతో పాటు తేలికపాటి పరుగును కలపండి. మీ ఆహారంలో ప్రోటీన్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలి. తగినంత నీరు తాగడం, సరైన నిద్ర తీసుకోవడం కూడా ముఖ్యమే. ముఖ్యంగా, కొత్త వ్యాయామ విధానాన్ని ప్రారంభించే ముందు వైద్యుడిని లేదా ఫిట్నెస్ నిపుణుడిని సంప్రదించడం మంచిది. మొత్తానికి, నిజమైన ఫిట్నెస్ అంటే బయటకు కనిపించేది కాదు.. మీరు ఎంతసేపు అలసిపోకుండా పరుగెత్తగలుగుతున్నారో అదే మీ ఆరోగ్య స్థితిని చెప్పగలదు.
తాజావార్తలు
-
Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
-
Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
RBI Loan Rules: చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మైక్రోఫైనాన్స్ లోన్ నిబంధనలను మార్చనున్న RBI?
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
ట్రెండింగ్
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..