ఫాస్ట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టంగా తింటారు.. అయితే ఏదైనా ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే.. ఇక బయట లభించే జంక్ ఫుడ్, ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగాఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలియకపోగా మనం వెంటనే మరణిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. నేటి తరుణంలో అకాలంగా మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. 20 సంవత్సరాల మొదలు వయసు పైబడిన వారి వరకు అందరూ కూడా ఏ కారణం లేకుండానే మరణిస్తున్నారు..
ఆ మరణానికి కారణం కూడా లేకపోలేదు.. అందుకు కారణం ప్రాసెస్ చేసిన ఫుడ్ కారణమని పరిశోధకులు తేల్చి చెప్పేశారు.. జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువగా చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలోకి వెళ్తున్నాయని దీంతో మరణాలు సంభవిస్తున్నాయని వారు చెబుతున్నారు. అదే విధంగా మార్కెట్ లో లభించే ప్యాకెజ్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, రెడీమెడ్ ఫుడ్స్ ను యొక్క రుచి పెంచడానికి అవి నిల్వ ఉండడానికి అనేక రకాల కెమికల్స్ వాడుతారు.. వాటిని తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. ముఖ్యంగా ఉదర సమస్యలు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు..
జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ ఎక్కువవుతున్నాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కవవుతున్నాయి. దీంతో అకాల మరణానికి గురి అవుతున్నారు..అప్పుడప్పుడూ పండగలకు, స్పెషల్ డేస్ లో, శుభకార్యాలకు తప్ప మిగిలిన రోజుల్లో మార్కెట్ లో లభించే ఆహారాలను తీసుకోకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లలు ఇలాంటి ఆహారాలను అరాయించుకోలేరు అందుకే ఎట్టి పరిస్థితుల్లోను పిల్లలకు ఇటువంటి ఆహారాలను అస్సలు ఇవ్వకూడదని జంక్ ఫుడ్ ను ఇవ్వకూడదని నిపుణులు హెచరిస్తున్నారు.. అంతగా తినాలని అనుకుంటే మాత్రం ఇంట్లో చేసుకొని తినడమే మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.