Exercise with Empty Stomach: ఎక్సర్‌సైజ్ ఎప్పుడు చేస్తున్నారు..? ఎలా చేస్తే బరువు తగ్గుతారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exercise with Empty Stomach: ఉరుకులు పరుగుల జీవితంలో అంతా గందరగోళ పరిస్థితి.. మానసికగా, శరీరకంగా కాస్త రిలాక్స్ కావాలంటే ఎక్సర్‌సైజ్, యోగా లాంటివి చేయాల్సిందే.. కొందరు తమ ఉద్యోగాలను బట్టి ఉదయమే వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే.. మరికొందరు వారి ఉద్యోగాల్లో షిఫ్ట్‌లకు అనుగుణంగా కూడా వర్కౌట్స్ చేస్తుంటారు.. అయితే, వర్కౌట్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతందని కొందరు భావిస్తే, మరికొంతమంది వర్కౌట్లతో లాభాలు పెద్దగా లేవని కూడా అనుకుంటారు. స్పీడ్ కార్డియో చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.. ఫాస్ట్ కార్డియో చేయడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుందని.. మీరు ఖాళీ కడపుతోనే ట్రెడ్ మిల్, సైక్లింగ్ చేస్తే.. కొవ్వు తగ్గుతుందని చెబుతున్నారు.. తినడానికి ముందే వర్కౌట్ చేస్తే.. శరీరంలోని అదనపు కేలరీలు తగ్గిపోతాయని.. శరీరం అప్పటి వరకూ నిల్వ చేసిన కొవ్వు తగ్గేందుకు ఇది ఎంతో దోహదపడుతుందంటున్నారు నిపుణులు.
Also Read
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
దీనిపై కూడా భిన్నవాదనలే ఉన్నాయి.. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత పెద్దగా తినేవాళ్లు ఉండరు.. నిద్ర కారణంగా ఏం తినకుండా ఉంటారు.. ఆ తర్వాత ఉదయమే నిద్రలేచి వర్కౌట్లు చేయడం వల్ల కొవ్వు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నమాట.. ఇదే సమయంలో.. దీంతో పెద్దగా ఉపయోగం లేదని.. శరీరంలోని కొవ్వు అలానే ఉంటుందని కూడా సూచిస్తున్నాయి.. అయితే, కండలు పెంచుకోవాలని భావించేవారు మాత్రం కార్డియో వర్కౌట్స్‌కి ముందు తినాలి. తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవడం వల్ల కండరాలకు మంచిదని చెబుతున్నారు.. కానీ, ఏం తినకుండా కష్టపడి వర్కౌట్ చేయడం వల్ల మీకు అసిడిటీ వచ్చే ప్రమాదం ఉందని.. కండరాలకి కూడా నష్టం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, ముందుగా ఏమైనా తినడం.. వర్కౌట్ తర్వాత కూడా తినడం వల్ల కండరాలకి బలం ఇచ్చినట్లుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.. మొత్తంగా.. వర్కౌట్ ముందు తినడం, తర్వాత తినడం అనేది వారివారి వ్యక్తిగత అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది మరి.
<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!