Can Thyroid Cause Hair Fall : థైరాయిడ్ కారణంగా జుట్టు విపరీతంగా రాలుతుందా?
- తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న థైరాయిడ్ సమస్య
- ఈ సమస్య కారణంగా విపరీతంగా రాలుతున్న జుట్టు
- జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలి, ఒత్తడి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మన శరీరాన్ని కాపాడాల్నిన వ్యవస్థలే మన శరీరంపై దాడులు చేస్తున్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలుగా షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలా వస్తున్న ఇలాంటి వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. మన గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి మన శరీరంలోని అనేక వ్యవస్థలను సమన్వయం చేస్తుంది. ఈ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల వల్ల థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో కామన్ గా వచ్చేది ‘హైపో థైరాయిడ్’. ఈ వ్యాధి వస్తే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ తప్పకవాడాల్సి ఉంటుంది.
జుట్టు రాలే సమస్య విపరీతం..
ఇవేకాకుండా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న చాలా మందిలో జుట్టు రాలే సమస్య విపరీతంగా కనిపిస్తుంటుంది. అలాంటి వారు జీవనశైలి, ఆహారపుటలవాట్లు, జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను వీలైనంత వరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
థైరాయిడ్ కంట్రోల్లో లేనపప్పుడు తలమీద వెంట్రుకలు..
థైరాయిడ్ కంట్రోల్లో లేనపప్పుడు తలమీద వెంట్రుకలు ఎదిగే ప్రదేశంపై ప్రభావం పడుతుందట. దానివల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతుంది. అలాగే జుట్టు పల్చగా మారుతుంది. దీన్నే డిఫ్యూజ్డ్ ఇన్ హెయిర్ ఫాల్, డిఫ్యూజ్డ్ ఇన్ హెయిర్ గ్రోత్ అని అంటుంటారు. కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్‌లో దీన్ని గుర్తించి మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది జరగకుండా చూసుకోవచ్చంటున్నారు.
ఇవి లోపించినా హెయిర్ ఫాల్
ఇకపోతే కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అలాంటి వారిలో విటమిన్ డి, కాల్షియం లోపం కారణంగా కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి అలాంటివారు కాల్షియం లోపంతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే.. చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్, కొన్ని గింజ ధాన్యాలు వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ డైలీ డైట్లో చేర్చుకోవాలి. అదే థైరాయిడ్ కంట్రోల్లో ఉండి విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లయితే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జాగ్రత్తలివే…
జుట్టు సంరక్షణ విషయంలోనూ తలస్నానం మొదలు దువ్వడం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అందులో కొన్నింటిని చూస్తే.. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలట. పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు కొబ్బరి నూనె పెట్టుకోవడం మంచిదంటున్నారు. అలాగే తలను పదే పదే దువ్వడం, హెయిర్ డ్రైయర్లను వాడడం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిడి, ఆందోళన వంటివి వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ కంట్రోల్లో ఉండడమే కాకుండా జుట్టు రాలడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!