రోజుకో కోడిగుడ్డును తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.. అయితే రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనుకొనేవాళ్లు ఇలాంటి రీసెపిలను ట్రై చెయ్యండి.. మంచి ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటాయి.. ఎగ్స్ తో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. స్నాక్ ఐటమ్స్ ను ఎక్కువగా చేసుకుంటారు.. ఈరోజు మనం ఎగ్ తో ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు – 3,
కోడిగుడ్లు – కోడిగుడ్లు – 2,
ఉప్పు – తగినంత,
కారం – ఒక టీ స్పూన్,
మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్,
పసుపు – కొద్దిగా,
మిక్డ్స్ స్పైసెస్ పౌడర్ – ఒక టీ స్పూన్,
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా..
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను బాగా కడిగి పొట్టు తియ్యాలి.. తరువాత వాటిని సన్నగా, పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారం లో కట్ చేసుకోవాలి. తరువాత వాటిపై ఉండే తడి అంతా పోయేలా టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి. తరువాత ఈ బంగాళాదుంప ముక్కల ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.. మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకొని కలుపుకోవాలి.. కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను తగినన్ని వేసుకోవాలి.. వీటిని సిమ్ లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ గోల్డ్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి.. అప్పుడే చాలా రుచిగా ఉంటాయి.. ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే రెడీ అయ్యినట్లే.. ఇక టమాట కిచప్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు..