Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!
- ఇంట్లోనే టేస్టీగా ఎగ్ 65 తయారీ సులువు
- తక్కువ పదార్థాలతో సూపర్ స్నాక్ రెడీ
- క్రిస్పీ ఫ్రైతో పాటు స్పెషల్ గ్రేవీ టచ్
- చుట్టాలు వచ్చినప్పుడు బెస్ట్ వెరైటీ ఐటమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ‘ఎగ్ 65’ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం రుచిలోనే కాదు, చూడటానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
ముందుగా ఈ వంటకానికి కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. 6 ఉడకబెట్టిన గుడ్లు, 2 పచ్చి గుడ్లు (బైండింగ్ కోసం), సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు (2 కప్పులు), కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, చిల్లీ సాస్ , రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చక్కెర.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్
తయారీ విధానం:
స్టెప్ 1: గుడ్డు ఉండల సిద్ధం చేయడం
మొదటగా ఉడకబెట్టిన గుడ్ల నుంచి పచ్చసొనను వేరు చేసి, తెల్లసొనను మాత్రమే చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్లో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, గరం మసాలా వేయాలి. వీటికి తగినంత కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్ కలిపి, రెండు పచ్చి గుడ్ల తెల్లసొనను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా (బాల్స్) చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2: డీప్ ఫ్రై
బాణలిలో నూనె వేడి చేసి, ఈ ఉండలను ఒక్కొక్కటిగా వేస్తూ బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా వేయించిన ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
స్టెప్ 3: గ్రేవీ టచ్
మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అందులో పెరుగు వేసి కాసేపు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక అందులో కశ్మీరీ కారం (మంచి రంగు కోసం), గరం మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా చిల్లీ సాస్ , రుచిని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు చక్కెర వేసి కలపాలి.
స్టెప్ 4:
చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డు ఉండలను ఈ పెరుగు మిశ్రమంలో వేసి, మంటను పెంచి మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా టాస్ (Toss) చేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆర్పేయాలి.
అంతే..! నోరూరించే ఎగ్ 65 రెడీ. దీనిని వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. మాంసాహారం తినని వారికి ఇది ఒక పర్ఫెక్ట్ హెల్తీ స్నాక్ అని చెప్పవచ్చు. ఈసారి మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి చూడండి..
Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్టాప్లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్కు పండగే.. అమెజాన్ సేల్లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు