NTV Telugu Site icon

Drinking Water: నిలబడి నీరు త్రాగితే ప్రమాదమా..! డాక్టర్లు ఏం చెబుతున్నారు..!

Water

Water

Drinking Water: సాధారణంగా మనం రోజు వాటర్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు నిలబడి తాగుతాం. అయితే అలా తాగితే ప్రమాదమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎనుకటికి ఒక సామెత ఉండేది. పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. అది నాడీ వ్యవస్థను నాశనం చేస్తుందని.. నిలబడి ఉన్న స్థితిలో నీరు శరీరంలోకి వెళ్లే వేగాన్ని పెంచుతుందని, ఇది మన ఆరోగ్యానికి ఒక విధంగా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చొని నీటిని తాగినప్పుడే మనిషి శరీరానికి మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Read Also: Law Commission: దేశ భద్రత, సమగ్రతకు “దేశద్రోహ చట్టం” కీలక సాధనం.. కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు..

నిలబడి నీటిని తాగడం వల్ల కీళ్ల ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల కీళ్లనొప్పులు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. టాక్సిన్ చేరడం పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ సమస్యలను ప్రేరేపిస్తుంది. అయితే కొందరు వైద్యులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. నిలపడి నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టం కలగదని వారు చెబుతున్నారు. కాకపోతే పడుకొని మాత్రం తాగకూడదని చెబుతున్నారు. నీరు త్రాగేటప్పుడు మీరు నిలబడినా లేదా కూర్చున్నా, అది వేగంగా శరీరంలో శోషించబడుతుంది.

Read Also: Viral: ఓ వ్యక్తిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లిన బుల్ షార్క్

మన శరీరానికి అనేక శారీరక విధులకు నీరు అవసరం. నిర్జలీకరణం త్వరగా చికిత్స చేయకపోతే శరీరానికి తీవ్రమైన కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఒక రోజులో చాలా నీరు త్రాగాలి. మీ మినరల్ తీసుకోవడం అలాగే ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కువ నీరు త్రాగడానికి సహాయపడే ద్రవం తీసుకోవడంలో వైవిధ్యాలు చేయండి. ఉదాహరణకు, మీ ఆహారంలో మీ ద్రవం తీసుకోవడం పెంచడానికి కొబ్బరి నీరు, ఇంట్లో తయారుచేసిన తాజా పండ్ల రసం, నిమ్మరసం, స్మూతీలను మీ ఆహారంలో చేర్చుకోండి.