కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకు ప్రమాదకరం, పిల్లలలో కరోనా కొత్త లక్షణాలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. నిపుణులు చెప్పిన దాని కన్నా అధిక రెట్లు కరోనా వేగంగా వ్యాపించింది. కోవిడ్19 మరణాలు సైతం అధికంగా సంభవించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో కరోనా కేసులలో, మరణాలలో భారత్ రెండో స్థానంలో ఉంది. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం తప్ప మహమ్మారిని అరికట్టేందుకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
కరోనా థర్డ్ వేవ్ గురించి అప్పుడే ఆందోళన మొదలైంది. కరోనా తొలి, రెండో వేవ్(Corona Second
Wave)లో టీనేజ్ దాటిన వారు, వయోజనులపై కోవిడ్19 ప్రభావం చూపింది. అయితే మరికొన్ని నెలల్లో
సంభవించనున్న కరోనా థర్డ్ వేవ్ 14 ఏళ్లలోపు చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణులు
హెచ్చరిస్తున్నారు. చిన్నారులలో సైతం కనిపించే కరోనా కొత్త లక్షణాలు ఇక్కడ అందిస్తున్నాం. పెద్దవారిలో
కనిపించినట్లుగానే వీరిలో సైతం జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు లాంటి లక్షణాలుంటాయని చెబుతున్నారు.
హార్వడ్ హెల్త్ ప్రకారం.. కొన్ని రోజులపాటు జ్వరం, దద్దుర్లు, కళ్లల్లో రక్తం తగ్గడం, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, డయేరియా, పగిలిన పెదవులు, పెదవులు ఎర్రబారటం, మెడ నొప్పి, కాళ్లు చేతులు వాపు, చికాకు, అతినిద్ర, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read
- Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
- Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
పెద్దవారి మాదిరిగా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) లేని కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్నారుల పట్ల జాగ్రత్తగా వ్యహరించాలి. కనుక పైన తెలిపిన కరోనా లక్షణాలు మీరు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరోవైపు చిన్నారులకు పోషకాహారం అందిస్తూ రోగనిరోధక శక్తి పెంచడానికి యత్నించాలి. కొన్ని అనారోగ్య లక్షణాలు చిన్నారులు నిమోనియా బారిన పడేందుకు దారితీస్తాయి. పెద్దవారిలో అయితే సమస్య సులభంగా గుర్తిస్తాం, కానీ చిన్నారులు సమస్య ఏంటన్నది చెప్పకుండా బాధపడతారు, ఏడుస్తుంటారు. కనుక కరోనా థర్డ్ వేవ్ ప్రారంభానికి ముందు నుంచే తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
చిన్నారులు మాస్కులు ధరించేలా చూసుకోవాలి. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం నేర్పించాలి. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం మరియు జింక్ లభించే ఆహారం ఇవ్వడం ద్వారా వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంటి వద్ద ఉన్నప్పటికీ చిన్నారులను శారీరక శ్రమ చేయడం నేర్పించాలి. వ్యాయామం, యోగాసనాలు వేయడం వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
పెద్దవారిలో ఏదైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సమయాలలో, ఐసోలేషన్‌కు వెళ్లాలి. చిన్నారులను పదే పదే కలవకూడదు. చిన్నారులలో పైన పేర్కొన్న కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. రోజుల తరబడి లక్షణాలున్నాయంటే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స అందించాలి.
తాజావార్తలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!