Site icon NTV Telugu

Beauty Tips: సన్‌స్క్రీన్ వేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ఫలితం తప్పదు..!

Sunscreen

Sunscreen

Beauty Tips: వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటారు. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కానీ చాలా సార్లు చర్మంపై సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. మీరు సన్‌స్క్రీన్‌ను అప్లై చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. అయితే తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Virender Sehwag: మహేంద్ర సింగ్ ధోనినీ వెరైటీగా విష్ చేసిన సెహ్వాగ్

సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ముఖంతో పాటు చెవి వెనుక, మెడ, పెదవులు మరియు పాదాల పై రాయాలి. సూర్యరశ్మికి కనీసం 15-30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. తద్వారా ఇది చర్మంలోకి సరిగ్గా వెళ్లి.. సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది. మీరు ఈత కొడుతుంటే, జిమ్‌లో చెమటలు పడుతూ ఉంటే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ని రాయాలి. చాలా మంది వ్యక్తులు ముఖానికి సన్‌స్క్రీన్ రాయడం మరచిపోతారు. దీని కారణంగా వారు సూర్యరశ్మి నుండి పూర్తిగా రక్షణ పొందలేరు. మరోవైపు వర్షాకాలంలో కూడా సన్‌స్క్రీన్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి. కొందరు వర్షాకాలంలో పనిచేయదని.. రాసుకోకుండా ఉంటారు. అంతేకాకుండా మీరు చర్మానికి రాసుకునే సన్‌స్క్రీన్‌పై గడువు తేదీని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్‌పైరీ డేట్‌తో సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అందుకే క్రమం తప్పకుండా మార్చడం కూడా అవసరం.

Exit mobile version