Hair Fall: వర్షాకాలంలో ఆరోగ్యం, చర్మమే కాదు జుట్టు వల్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలు జనాలను చాలా ఇబ్బందిపెడుతుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు చాలా రాలడం జరుగుతుందని కొందరు అంటారు. అయితే వర్ష కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా చెమట, శరీరంలోని వేడి కూడా జుట్టు రాలడంలో ప్రభావితమవుతాయి. అయితే వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ చిన్న పనులు చేస్తే ఈజీగా మన జుట్టును కాపాడుకోవచ్చు.
Read Also: Pakistan: బక్రీద్ ఎఫెక్ట్.. పాకిస్తాన్‌లో పెరుగుతున్న జంతువుల దొంగతనాలు..
వర్షంలో పొరపాటున తడిస్తే వెంటనే షాంపూతో తలని శుభ్రం చేసుకోవాలి. వర్షపు నీటిలో జుట్టు రాలడానికి కారణమయ్యే రసాయనాలు లేదా బ్యాక్టీరియా ఉంటాయి. దాంతో వర్షపు నీరు స్కాల్ప్ లోపలికి వెళ్లి లోపల దెబ్బతింటుంది. మరోవైపు ఒకవేళ వర్షంలో తడిసినట్లైతే.. జుట్టును షాంపూతో గోరువెచ్చని నీటితో కడగాలి. గోరువెచ్చని నీటితో జుట్టులోని జిగురును, మురికిని తొలగిస్తుంది. అంతేకాకుండా గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే.. మీ మనస్సు కూడా రిలాక్స్‌గా ఉంటుంది. గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల తలలో గడ్డకట్టిన క్రిములు కూడా నాశనం అవుతాయి.
Read Also: Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది
వాతావరణంలో తేమ మరియు ధూళి కారణంగా తలలో చుండ్రు ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. అయితే స్కాల్ప్ మరియు వెంట్రుకలకు పోషణ కోసం నూనె రాయాలి. స్కాల్ప్ పొడిబారడం కూడా అవసరమే.. స్కాల్ప్ పొడిగా ఉంచుకోవడం వల్ల తేమ పేరుకుపోదు. దీంతో జుట్టు రాలడం వంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు మీ జుట్టును స్ట్రెయిట్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తే.. వర్షాకాలంలో దానికి దూరంగా ఉండండి. ఈ సీజన్‌లో జుట్టు మూలాలు బలహీనమవుతాయని.. వాటిని వేడి చేస్తే జుట్టు రాలడం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా మరియు మెరిసేలా ఉండాలంటే.. వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ వేసుకోవాలి. కలబంద జెల్ యొక్క హెయిర్ మాస్క్ జుట్టును బలోపేతం చేయడంతో పాటు మెరిసేలా చేస్తుంది.
