Vastu Tips: మీ డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Tips: సాధారణంగా చాలా మంది వారి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ నిత్యం భోజనం చేసే డైనింగ్ టేబుల్ విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని మాత్రం తెలుసుకోరు. వాస్తు శాస్త్రం ప్రకారం.. డైనింగ్ టేబుల్ అనేది కేవలం భోజనం చేసే చోటు మాత్రమే కాదు, అది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను, ఇంటి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే కీలక ప్రాంతం. మరి డైనింగ్ టేబుల్‌పై ఏ వస్తువులు ఉండకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చాలామంది భోజనం చేయగానే వేసుకోవాలని మందులను డైనింగ్ టేబుల్‌పైనే ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇది చాలా అశుభం. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు పెరుగుతాయని, ఎప్పుడూ ఎవరో ఒకరు మందులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కత్తులు, కత్తెరలు లేదా ఇతర పదునైన వస్తువులను భోజనం చేసిన తర్వాత టేబుల్‌పైనే వదిలేయకూడదు. ఇవి ఇంట్లో ఒత్తిడిని, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను పెంచుతాయి. పని ముగియగానే వీటిని వాటి నిర్ణీత స్థలంలో జాగ్రత్త చేసుకోవాలి.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
భోజనం ముగిసిన వెంటనే ఎంగిలి ప్లేట్లు, మిగిలిపోయిన ఆహారాన్ని టేబుల్‌పై ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది క్రమంగా ఇంటి ఆర్థిక పరిస్థితిని కుంగదీయడమే కాకుండా, మనశ్శాంతిని దూరం చేస్తుంది. టేబుల్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. డైనింగ్ టేబుల్‌ను ఒక స్టోర్ రూమ్‌లా వాడకూడదు. పాత వార్తాపత్రికలు, కరెంటు బిల్లులు, బ్యాగులు లేదా పనికిరాని వస్తువులను అక్కడ పేరుకుపోనివ్వకండి. టేబుల్ ఎంత ఖాళీగా, శుభ్రంగా ఉంటే ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంచులు పగిలిన ప్లేట్లు లేదా పగుళ్లు ఉన్న గిన్నెలు, గ్లాసులను డైనింగ్ టేబుల్‌పై ఉంచడం వాస్తు దోషానికి దారి తీస్తుంది. ఇవి ఇంట్లో ఆటంకాలు, ఆర్థిక నష్టాలకు సంకేతంగా పరిగణించబడతాయి.
అదృష్టం కలిసి రావాలంటే ఇలా చేయండి..
డైనింగ్ టేబుల్‌పై ఎప్పుడూ ఒక గిన్నెలో తాజా పండ్లను ఉంచాలి. ముఖ్యంగా ఆపిల్స్, నారింజ లేదా అరటిపండ్లు వంటివి ఉండటం వల్ల ఇంట్లో సంపద, సమృద్ధి పెరుగుతాయని నమ్ముతారు. పండ్లు ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. అలాగే మీ ఇంట్లో ప్లాస్టిక్ పూల కంటే సహజమైన తాజా పూలను ఒక ఫ్లవర్ వాజ్‌లో ఉంచడం చాలా మంచిది. పూల సువాసన, రంగులు ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుతాయి. ఇది కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలను తొలగించి, ప్రేమను పెంచుతుంది. డైనింగ్ టేబుల్ మధ్యలో ఒక చిన్న క్రిస్టల్ బౌల్‌లో నీరు పోసి, అందులో కొన్ని పూల రెక్కలను వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. స్పటికాలు ఇంటికి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
టేబుల్‌పై ఎప్పుడూ ఉప్పు, పంచదార డబ్బాలు నిండుగా ఉండాలి. ఇవి ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా, ఇంట్లో ఏ వస్తువుకూ లోటు లేకుండా ఉండేలా చేస్తాయని ఒక నమ్మకం. డైనింగ్ టేబుల్‌పై ఎప్పుడూ మురికి లేని, శుభ్రమైన టేబుల్ కవర్‌ను వాడాలి. లేత రంగులు లేదా పసుపు, క్రీమ్ వంటి రంగుల కవర్లు సానుకూలతను కలిగిస్తాయి. డైనింగ్ టేబుల్ ప్రతిబింబించేలా పక్కన గోడకు అద్దం తగిలించడం అత్యంత శక్తివంతమైన వాస్తు చిట్కా అని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసేటప్పుడు ఆ ఆహారం అద్దంలో కనిపిస్తే, అది ఇంట్లో రెట్టింపు సంపదకు, ఆహార ధాన్యాల సమృద్ధికి దారి తీస్తుందని పేర్కొన్నారు. డైనింగ్ టేబుల్ ఎంత ప్రశాంతంగా, అందంగా ఉంటే లక్ష్మీ కటాక్షం అంతగా ఉంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!