షుగర్ వ్యాధిగ్రస్తులు బాగా పెరిగిపోతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అస్తవ్యస్త మయిన జీవనవిధానం, కాలుష్యం వంటి కారణాల వల్ల డయాబెటిస్ రోగులు పెరిగిపోతున్నారు. డయాబెటిస్ వున్న ఆహారం విషయంలో నిబంధనలు పాటించాల్సి వుంటుంది. తిండి విషయంలో అన్నీ వున్నా కట్టడి చేసుకోవాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుకా ఆలోచించాలి. షుగర్ కారణంగా ఎలాగూ స్వీట్లు తినలేరు.. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తినాలన్నా ఎన్నో సందేహాలు. ఫ్రూట్స్ లోనూ చక్కెరస్థాయిలు ఉంటాయి కాబట్టి ఏవి తినొచ్చు.. ఏవి తినరాదు అనే అనుమానాలు వేధిస్తుంటాయి. వేసవి కాలం వచ్చిందంటే రోడ్డు పక్కన పుచ్చకాయలు నోరూరిస్తుంటాయి. పుచ్చకాయల్ని డయాబెటిస్ రోగులు తినవచ్చా అనే సందేహం కలుగుతుంటుంది.
అయితే పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదంటున్నారు వైద్యనిపుణులు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్‌తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్ల విషయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటుంది. కానీ ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి పిండిపదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు పుచ్చకాయ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేకుండా తినవచ్చు.
అలాగే యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్‌లో పెక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు యాపిల్ తినడం మంచిదే. అయితే యాపిల్ పెద్ద సైజ్‌లో ఉంటే సగం తినండి చాలు.
Rare Monkeys Seize: కోల్ కతాలో అరుదైన కోతులు స్వాధీనం