NTV Telugu Site icon

Diabetes: డయాబెటీస్‌ బీ అలర్ట్.. 2050 నాటికి 130 కోట్ల మందికి చేరే అవకాశం

Diabetes

Diabetes

Diabetes: ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య డయాబెటీస్‌. డయాబెటీస్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది
డయాబెటీస్‌ బారిన పడుతున్నారు. ఈ సంఖ్య ఇండియతోపాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో పెరుగుతోంది. 2050 నాటికి డయాబెటీస్‌ రోగుల సంఖ్య 130 కోట్లకు చేరే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మంది వరకు మధుమేహం బారినపడే అవకాశం ఉన్నట్లు లాన్సెట్‌ చేపట్టిన ఓ అధ్యయనం తేల్చింది. 1990–2021 మధ్య కాలంలో 204 దేశాలు, ప్రాంతాల్లో .. మరణాలు, అశక్తత, డయాబెటిస్‌ వ్యాప్తి వంటి అంశాలకు సంబంధించి 27 వేలకు పైగా రకాల గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టినట్లు లాన్సెట్‌ తెలిపింది. 2050 నాటికి మధుమేహం వ్యాప్తి సామాజిక, భౌగోళిక అంశాలు, ఒబేసిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసినట్టు వివరించింది. ప్రజలు తమ ఆరోగ్య విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని లాన్సెట్‌ ప్రకటించింది.

Read also: Bro Movie Run Time: ‘బ్రో’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?

డయాబెటీస్‌లో రెండు రకాల డయాబెటీస్‌ రోగులు ఉంటారు. వారిలో టైప్‌–1, టైప్‌–2 డయాబెటిస్‌లలో వచ్చే మూడు దశాబ్దాల్లో టైప్‌–2 బాధితులే ఎక్కుమంది ఉంటారని సర్వేలో వెల్లడైంది. టైప్‌–1 అనేది ఆటో ఇమ్యూన్‌ వ్యాధి.. దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఇది ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. ఇక టైప్‌–2 డయాబెటిస్‌తో ఇన్సులిన్‌ నిరోధకత క్రమంగా పెరుగుతుంటుంది. ఈ పరిస్థితి ఎక్కువగా పెద్దల్లో కనిపిస్తుంది. అయితే దీనిని ముందుగానే గుర్తించవచ్చని.. దానిని నివారించవచ్చు అధ్యయనం ప్రకటించింది. డయాబెటిస్‌తో సంబంధం ఉన్న అనేక సమస్యల కారణంగా ఈ సర్వేలో తేలిన వివరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మధుమేహ బాధితులు గుండెజబ్బు, గుండెపోటు, కంటి చూపు కోల్పోవడం, పాదాలకు అల్సర్లు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవగాహన లేకపోవడం, సరైన చికిత్స లేకపోవడం వల్ల చాలా మంది ఈ సమస్యల బారిన పడతారు. మధుమేహం ప్రమాదాన్ని పెంచేవి సాధారణంగా వయస్సు, ఊబకాయం. ఎక్కువ బీఎంఐకి అధిక–క్యాలరీ ఉత్పత్తులు, అల్ట్రా–ప్రాసెస్డ్‌ ఆహారం, కొవ్వు, చక్కెర, జంతు ఉత్పత్తుల వినియోగం. వీటితోపాటు తగ్గిన శారీరక శ్రమ డయాబెటిస్‌కు కారణాలుగా ఉన్నాయి. జన్యు సంబంధమైన కారణాలతోపాటు అనారోగ్యకర జీవన శైలితో కూడా మధుమేహం బారినపడే ప్రమాదముంది.

Read also: Amitabh Bachchan : KBC సీజన్ 15 తో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్న అమితాబ్..

చికిత్స కంటే.. వ్యాధి రాకుండా జాగ్రత్త పడటం మంచిదని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలని సూచిస్తున్నారు. ఎక్కువ రిస్క్‌ ఉన్న వారు ఫైబర్‌ ఎక్కువగా ఉండే, తృణ ధాన్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఒకే చోట గంటల కొద్దీ కూర్చోరాదు. అప్పుడప్పుడు నడక వంటి వాటితో శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలి. రోజులో కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలి. బరువు పెరక్కుండా జాగ్రత్తపడాలి. దాహం అతిగా అవుతున్నా, నీరసంగా ఉన్నా, తెలియకుండానే బరువు కోల్పోతున్నా, కంటి చూపు మందగించినా, తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.