ఏది తినక పోయిన కూడా జనాలు బరువు పెరుగుతున్నారు.. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగి పోయి ఉంటారు..అయితే వంటలకు వాడే నూనెల్లో కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.. అస్సలు ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో నూనెల వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. నూనెలను ఎక్కువగా వాడడం వల్ల మనం గుండె జబ్బులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మనం నూనెల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. నూనెలకు బదులుగా మనం మీగడను కానీ, వెన్నను కానీ ఉపయోగించాలి. ఇవి తక్కువ ఉష్ణోగ్రత వద్ద త్వరగా వేడెక్కుతాయి.అలాగే మీగడలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుందని ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలోకి చేరినప్పటికి మనం తీసుకునే ఆహారంలో ఉండే ఫైబర్ ఈ కొలెస్ట్రాల్ ను మలం ద్వారా బయటకు తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు..
ఇక నూనెలకు బదులుగా మనం ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనకు మార్కెట్ లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది. ఈ ఆవు నెయ్యిని అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ మోతాదులో వంటల తాళింపుకు వాడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనదని దీనిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని వారు సూచిస్తున్నారు. నూనెను ఎక్కువగా వాడితేనే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కానీ నెయ్యిని తక్కువగా వాడినప్పటికి దీని రుచి, వాన కారణంగా కూరలు చాలా రుచిగా ఉంటాయని వారు చెబుతున్నారు.. ఇలా నెయ్యిని తరచూ వాడటం వల్ల బరువు తగ్గుతారు..అంతే కాదు గుండె జబ్బులు దరిచేరవని ఆరోగ్య ప్రముఖులు చెబుతున్నారు.. అదన్న మాట.. ఇక అందరు ఇలా నెయ్యిని వాడితే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. సో ఇప్పటి నుంచైనా నెయ్యిని తీసుకోవడం అలవాటు చేసుకోండి.